జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ గ్రామానికి చెందిన దండే హరీష్‌రెడ్డి(28) బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చాడు.
గురువారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ నుంచి ధర్మవరం వెళుతున్న రైలు జమ్మలమడుగు స్టేషన్ సమీపంలోకి రాగానే హరీష్‌రెడ్డి ఒక్కసారిగా రైలు పట్టాలపై తల పెట్టాడు. దీంతో తల, మొండెం వేరయ్యాయి. కాగా బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment