గంగమ్మ తిరునాలలో అపశ్రుతి
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామంలో గురువారం గంగమ్మ తిరునాల సందర్భంగా సిరి బండి లాగుతున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సిరి బండి గ్రామం నుంచి బయలుదేరిన సమయంలో ఆటో డ్రైవర్ సుదర్శన్(62)పై సిరిబండి చక్రం ఎక్కడంతో నడుములు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే గ్రామస్తులు అతన్ని ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు. ఈ తిరునాలకు భారీగా భక్తులు, గ్రామస్తులు రావడంతో సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు సుదర్శన్‌కు భార్య సౌదామణి, కుమారుడు పురుషోత్తం, కుమార్తె సుజాత ఉన్నారు.
గతంలోనూ జెడ్పీటీసీ మృతి..
రెండేళ్ల క్రితం సిరిబండి మహోత్సవంలో అప్పట్లో పులివెందుల మండల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మృతి చెందారు. ఆ సంఘటనను ఇంకా మరవకముందే మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మరోమారు ఆటో డ్రైవర్ సుదర్శన్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరునాల నేపథ్యలో పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టి ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘఽటనలు, ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు.
సిరిబండి చక్రం ఎక్కడంతో ఆటో డ్రైవర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment