
● అమ్మ ఎవరికై నా అమ్మే!
ప్రేమకు మనుషులే కాదు.. జంతువులు కూడా అతీతం కాదు. అందులోనూ తల్లిప్రేమ. ఈ సృష్టిలో అత్యంత తీయనైనది. పోల్చలేనిది. వర్ణించలేనిది అంటూ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమే. మనుషులే కాదు.. జంతువులు కూడా తమ తల్లి ప్రేమను చాటడం.. అందులోని మాధుర్యాన్ని పంచడం చూస్తూనే ఉంటాం. అది కేవలం సంతోష సమయంలోనే కాదు.. కష్టకాలంలోనూ ఆ అమ్మప్రేమ బహిర్గతమవుతుంది. అదే తరహాలో ఓ శునకం తల్లిప్రేమన చాటుకున్న సంఘటన రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ ఎదుట కనిపించింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారంటూ విచారణ నిమిత్తం సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని మురళీ కృష్ణను పోలీసులు హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీసు స్టేషన్‌లోకి ఎవరూ రాకుండా పోలీసులు గేటు మూసి వేశారు. ఈ సమయంలో తల్లి కుక్క గేటు బయట ఉండిపోగా.. పిల్ల మాత్రం గేటు లోపల ఉండిపోయింది. దీంతో దిక్కు తోచని తల్లి కుక్క తన బిడ్డ కోసం గేటు బయట అలాగే నిరీక్షిస్తూ ఉండగా.. గేటు లోపలి నుంచి ఆ చిన్న శునకం తల్లివైపు అలాగే చూస్తూ నిలబడి పోయింది. సుమారు 3 గంటల తర్వాత గేటు తెరవడంతో తల్లీబిడ్డలు కలిసి పరుగులు తీశాయి. ఈ దృశ్యాన్ని చూసిన వారు తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా.. అమ్మ ఎవరికై నా అమ్మే కదా అంటూ చర్చించుకోవడం విశేషం.
– ఫోటో, ఎస్.కె. మహమ్మద్ రఫీ,
సాక్షి ఫొటో గ్రాఫర్, కడప
Comments
Please login to add a commentAdd a comment