ఇంటర్ పరీక్షలకు వేళాయె!
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1 నుంచి జిల్లావ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 152 జూనియర్ కళాశాలలకు సంబంధించి 32,885 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికి సంబంధించిన హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ అవుతున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తు న్నారు. పరీక్షల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘానీడలో నడవనున్నాయి. దీంతోపాటు పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయింది.
పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందుకోసం అన్ని పరీక్షా కేంద్రాలలో కలిసి 950 ిసీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారనే విషయాన్ని అటు బోర్డు నుంచి ఇంటర్మీడియట్ అధికారులు, ఇటు జిల్లా అధికారులు నిరంతరం పర్యక్షించేందుకు వీలుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. దీంతోపాటు జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ సిట్టింగ్ లేదా ఫ్లయింగ్ స్వాడ్స్ ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. దీంతోపాటు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పోలీసు బందోబస్తు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు 3 టీమ్స్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా, 10 సిట్టింగ్ స్వాడ్‌గాపాటు డీఈసీ, స్ఫెషల్ ఆఫీసర్, ఆర్‌ఐవో కూడా పరీక్షలను పర్యవేక్షించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను పోలీసు బందోబస్తు నడుమ స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచారు.
మేనేజ్‌మెంట్ 1–ఇయర్ 2–ఇయర్ మొత్తం
జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 17114 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 15,771 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. 64 పరీక్షా కేంద్రాలకు 64 మంది ఛీప్ సూపరింటెంటెంట్లు, 64 డిపార్టుమెంట్ ఆఫీసర్లతోపాటు 700 మంది ఇన్విజిలేటర్స్‌ను నియమించారు.
మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభం
అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు
32,885 మంది విద్యార్థులకు 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
మోడల్ 211 154 365
హైస్కూల్ ప్లస్ 248 138 386
ప్రైవేటు ఎయిడెడ్ 338 330 668
కేజీబీవీ 548 379 927
ఒకేషనల్ 517 483 1000
సోసియల్‌వేల్ఫేర్ 618 543 1161
గవర్నమెంట్ 2581 2116 4697
ప్రైవేటు కాలేజీలు 12053 11628 23681
మొత్తం 17114 15771 32885
సర్వం సిద్ధం
ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. పిల్లలంతా తమకు సంబంధించిన హాల్‌టికెట్లతో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయానికి ముందుగానే చేరుకోవాలి. పిల్లలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశాం. ఎవరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాయాలి. – బండి వెంకటసుబ్బయ్య,
ఆర్‌ఐవో, ఇంటర్ విద్య
ఇంటర్ పరీక్షలకు వేళాయె!
ఇంటర్ పరీక్షలకు వేళాయె!
Comments
Please login to add a commentAdd a comment