● కూలిన ప్రహరీ
పులివెందుల రూరల్ : పట్టణంలోని సదాశివారెడ్డి హాస్పిటల్ సమీపంలో ఉన్న మున్సిపల్ క్లస్టర్ కార్యాలయం ప్రహరీ గురువారం కూలిపోయింది. ప్రహరీ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయి నేలకొరిగింది. గోడ పక్కనే ఉన్న కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. సాధారణంగా ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు ప్రహరీ కింద కూర్చొని భోజనాలు చేస్తుండేవారు. గురువారం కూలీలకు సెలవు కావడంతో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పిన ప్రమాదం
● కూలిన ప్రహరీ
Comments
Please login to add a commentAdd a comment