కడప రూరల్ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లింగ నిర్ధారణపై ప్రకటనలు ఇస్తే చట్టరీత్యా కఠిన చర్యలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్టును ఆస్పత్రులు పటిష్టంగా అమలు చేయాలన్నారు. అలాగే తప్పనిసరిగా జిల్లా అప్రప్రియేట్ అథారిటీలో నమోదై చట్టంలోని సూచనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. లేకుంటే నిర్వాహకులకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాతోపాటు మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు.
నేడు ఆర్‌సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఆర్‌సీపీ ప్రతినిధులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నగరంలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిరామయ్య, ఆర్‌సీపీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్ తెలిపారు.సోమవారం నగరంలోని ఆర్‌సీపీ కార్యాలయంలో వారు మా ట్లాడారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెడితే ఉన్న పరిశ్రమలను తరలించడం అధికమైందన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, వాటిపై భవిష్యత్తు రోజు ల్లో ఉద్యమాలు నిర్వహించడానికి, ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇన్‌చార్జి ఈఓపీఆర్డీగా సురేష్‌బాబు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని రేకులకుంట గ్రేడ్ 3 గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబును బి.మఠం ఇన్‌చార్జ్ ఈఓపీఆర్డీగా అదనపు బాద్యతలు అప్పగించామని ఎంిపీడీఓ వెంగమునిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న కుమార రంగయ్య ఒంటిమిట్ట ఇన్‌చార్జీ ఎంపిడీఓ గా అదపు బాద్యతలు నిర్వహిస్తునప్పుడు నిధుల గోల్‌మాల్ జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో జిల్లా అధికారులు ఆయనను సస్పెండ్ చేశారని వెల్లడించారు.
19న మహాధర్నా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కింద రూ.3వేల గౌరవ వేతనంతో పని చేస్తున్న కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్‌తో ఈ నెల 19న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 86 వేల మంది పేద మహిళా కార్మికులు అతి తక్కువ వేతనం తీసు కుంటున్న కార్మికులుగా మిగిలిపోయారన్నారు. ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, హెల్త్ కార్డు కూడా లేదని తెలిపారు. పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల వేతనాల పెంపుదలపై ప్రకటన చేయాలన్నారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం కడప జిల్లా నాయకులు మేరీ, కామాక్షి పాల్గొన్నారు.
7న రాష్ట్ర స్థాయి
బండలాగుడు పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగర శివార్లలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని చిన్నపల్లె యోగి శ్రీ నరసింహ్మ స్వామి 217వ ఆరాధన సందర్భంగా రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గోసుల మునిరెడ్డి తెలిపారు. ఇందులో మొదటి బహుమతిగా రూ.70,016, రెండవ బహుమతిగా రూ. 50,016, మూడవ బహు మతి రూ.30.016, నాల్గవ బహుమతి రూ. 20,016, ఐదో బహుమతి రూ. 15,016, ఆరో బహుమతి రూ.10,016 ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment