ఢిల్లీ సంస్కృత విద్యాలయ శిక్షణకు మునికుమార్
కడప కల్చరల్ : ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విద్యాలయం, చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సౌద సంస్థాన్ (ఎర్నాకులం) సంయుక్తంగా నిర్వహించే పది రోజుల శిక్షణకు కడపకు చెందిన నాగదాసరి మునికుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈనెల 12 నుంచి 21వ తేది వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో తాళపత్ర అధ్యయనం, గ్రంథలిపి, శారద లిపి అధ్యయనాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంకా తాళపత్ర గ్రంథాల ఎడిటింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారన్నారు. కేరళ ఎర్నాకులంలోని వెలియనాడ్ ఆదిశంకర నిలయంలో ఈ శిక్షణ ఉంటుందని తెలియజేశారు. మునికుమార్ యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేసి ప్రొద్దుటూరు మళయాళ స్వామి కళాశాలలో విద్వాన్ పూర్తి చేశారు.
14 నుంచి
కబడ్డీ పోటీలకు ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : పులివెందులలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు ఎంపికలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ రవీంద్రారెడ్డి సెక్రటరీ ఆర్ వెంకటసుబ్బయ్య వైస్ ప్రెసిడెంట్ జి.గురుశేఖర్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ డీఎస్‌ఎస్ స్టేడియంలో 34వ సబ్ జూనియర్స్ బాల బాలికల ఉమ్మడి జిల్లా కబడ్డీ సెలక్షన్స్ జరిగాయని వివరించారు. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు పులివెందులలో జరిగే అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ ఎంపికలకు పీడీ నిత్య ప్రభాకర్, జిలాని బాష ,పిడి వర్కింగ్ సెక్రటరీ టి శ్రీవాణి, ట్రెజరర్ కొండయ్య, వైస్ ప్రెసిడెంట్లు అరుణ సుహాసిని లీల సుమలత నరేష్ లోకేష్ తదితరులు సహకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment