కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర థియరీ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను కల్పించారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలకు సంబంధించి 14690 మంది విద్యార్థులకుగాను 14142 మంది హాజరుకాగా 548 మంది గైర్హాజరయారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్‌ఐఓ..
కడప నగరంలోని నారాయణ, చైతన్య, సాయిరాం, గాయత్రి తదితర కళాశాలలను ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తనిఖీ చేశారు. అలాగే స్క్వాడ్, డీఈసీ సభ్యులు జిల్లాలోని బద్వేల్, పోరుమామిళ్ల, మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, పులివెందుల, జమ్మలమడుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్, డీబార్ కేసులుకానీ నమోదు కాలేదని ఆర్‌ఐవో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment