No Headline
కడప అగ్రికల్చర్ : కూటమి ప్రభుత్వం రైతన్నలకు వ్యతిరేకమని మరోసారి రుజువైంది. ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించకుండా మెండిచేయి చూపించిన బాబు ప్రభుత్వం.. తాజాగా పంట కొనుగోళ్లు చేయకుండా కర్షకుల జీవితాలతో ఆడుకుంటోంది. ముఖ్యంగా కందిలో నాణ్యత ప్రమాణాలు లేవంటూ కొనుగోళ్లకు వెనకడుగు వేస్తోంది. అటు సరైన దిగుబడి లేక.. ఇటు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక కర్షకలోకం కన్నీరుపెడుతోంది. జిల్లాలో ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, కడప వ్యవసాయ డివిజన్ల పరిధిలో దాదాపు 30 మండలాల్లో 11 వేలకు పైగా రైతులు దాదాపు 30 వేల ఎకరాల్లో కందిపంటను సాగు చేశారు. ఈ ఏడాది సాగు చేసిన కంది పంటకు సంబంధించి పూతపిందెకు వచ్చే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఆకాశంలో మబ్బులు ఏర్పడటం, మొయిలీ కమ్మేయడం వంటి కారణాలతో దిగుబడిపై దెబ్బ పడింది. దీంతో కందుల్లో నల్లగింజ రావడంతో పాటు దిగుబడి కూడా తగ్గింది. దీంతోపాటు మిషన్లతో నూర్పిళ్లు చేయడంతో అక్కకడ్కడ కందులు పగిలి బేడలు కూడా అయ్యాయని పలువురు రైతులు తెలిపారు. కంది పంటకు సంబంధించి ఈ ఏడాది 9497.99 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనాలు వేశారు.
2374 మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా...
రబీ కంది పంటలకు సంబంధించి దిగుబడిలో 25 శాతం మేర కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కందిపంటలకు సంబంఽధించి ఈ ఏడాది 9497 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 25 శాతం అంటే 2374 మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేయా లని లక్ష్యంగా ఏర్పాటు చేశారు. కాకపోతే ప్రభుత్వం ప్రస్తుతం 1604 మెట్రిక్ టన్నులకు కొనుగోలుకు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో కందుల కొనుగోలు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభించారు. మార్చి 2వ తేదీ వరకు కేవలం 198 మంది రైతుల నుంచి 205 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. అది కూడా పులివెందుల, సింహాద్రిపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు కేంద్రాల మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా నాలుగు కొను గోలు కేంద్రాలైన కమలాపురం, తొండూరు, ముద్ద నూరు, పోరుమామిళ్ల కేంద్రాల్లో అసలే బోనీయే కాలేదు. కందుల్లో నల్లగింజలు, నాసుగింజలు ఉండటంతోపాటు నూర్పిళ్ల సమయంలో పలు చోట్ల కందులు పగలటంతోకొనుగోలుకు కొర్రీలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు
ప్రభుత్వం కందులకు క్వింటా రూ. 7550 మద్దతు ధరను ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో కందులు క్వింటాల్‌కు రూ. 6500 నుంచి 6800 వరకు పలుకుతుంది. కందులను కొనుగోలు చేసేందుకు ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కందుల నాణ్యత ప్రమాణాలు ఇవే...
వివరాలు నాణ్యత
ప్రమాణాలు
తేమశాతం 12 శాతం
ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం
ఇతర తినదగిన గింజలు 1 శాతం
ఇతర వంట గింజలు 3 శాతం
ముతక/ పూర్తిగా తయారుకాని 3 శాతం
పాక్షికంగా దెబ్బతిన్న,
రంగుమారిన 3 శాతం
విరిగిన గింజలు
పురుగుకుట్టిన గింజలు 3 శాతం
ప్రకృతి ప్రకోపం కంది రైతులకు శాపం
కొనుగోలులో కొర్రీలు వేస్తున్న ప్రభుత్వం
నాసులు, నల్లగింజలు, బేడలంటూ నిరాకరణ
కాళ్లరిగేలా కొనుగోలు కేంద్రాల చుట్టు ప్రదక్షిణ చేస్తున్న రైతులు
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment