అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్‌న్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
● గాలేగరు–నగరి కాలువ తవ్వకం వల్ల తమ గ్రామాల రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకుండా పోయిందని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. పాత రహదారి వద్దే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
● కమలాపురం పాలిటెక్నిక్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ కింద తనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులో నియామకం చేయాలని చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన పి. రాబియా కోరారు.
● తనకు వితంతు పెన్షన్ ఇప్పించాలని ముద్దనూరు మండలం, పెనికేలపాడు గ్రామానికి చెందిన అంగల్లగుత్తి గంగులమ్మ అభ్యర్థించారు.
బ్యాంకుల భాగస్వామ్యం అవసరం
వ్యవసాయంలో అధునాతన సాంకేతికతను అవసరమైన పెట్టుబడుల కోసం రైతులకు రుణ సహకారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు అందించడంలో సెప్టెంబర్ మాసాంతానికి గాను వైఎస్‌ఆర్ జిల్లా పురోగమనంలో కొనసాగుతున్నందుకు బ్యాంకర్లను అభినందించారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి.. జిల్లా ఆర్థిక అభివద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశానికి సంబంధించిన అజెండా, వివరాలను వివరించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment