నూతన కార్యవర్గం ఎన్నిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్‌టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మికర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మూడోసారి ఎన్నిక కావడం విశేషం. ప్రొద్దుటూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికకు సంబందించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకు లక్ష్మీకర్‌రెడ్డిరి అధ్యక్షునిగా ఎంపిక చేశారు. జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్‌సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిని రవాణాశాఖలో పని చేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.కడపలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆటోను ఢీకొన్న లారీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణ పరిధిలోని ఫుడ్ అండ్ సైనన్స్ కళాశాల సమీపంలో ఆదివారం ఆటోను లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్సార్ కాలనీ, రాజీవ్ కాలనీ నుంచి కూలీ పనులు చేసేందుకు భవాని, చిన్న లక్ష్మిదేవి, నాగేశ్వరి, రాజేశ్వరి, మంజుల, వెంగమ్మతోపాటు మరో నలుగురు ఆటోలో ఇప్పట్ల గ్రామానికి వెళుతుండగా ఫుడ్ అండ్ సైన్‌న్స్ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిని పులివెందుల పట్టణ పరిధిలోని కడప రోడ్డులో ఉన్న వైఎస్సార్ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ సీఐ హాజీవలి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి రమణ, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్ ఉన్నారు.
సీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మికర్‌రెడ్డి
నూతన కార్యవర్గం ఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment