జర్నలిస్టును బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కడప కార్పొరేషన్ : జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డిని బెదిరించిన వేంపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు జీవీ రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. ఆదివారం వారు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగిన పరిణామాలపై వార్తలు రాయడం వల్ల కక్షగట్టిన మాజీ ఎంపీటీసీ రమణ.. వాట్సాప్ గ్రూప్‌లో చేసిన మెసేజ్‌ను సాకుగా చూపి బెదిరించడం తగదన్నారు. విలేకరి తప్పు చేస్తే వారి యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలే తప్ప బెదిరించడం సరికాదన్నారు. శ్రీనాథ్‌రెడ్డిని చంపుతానని బెదిరిచండం దారుణమన్నారు. మిగిలిన జర్నలిస్టులు తమపై వార్తలు రాయకుండా ఉంటారనే ఆలోచనతోనే ఇలా చేశారన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతుంటే.. కింది స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, సుబ్బారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శ్రీనాథ్‌రెడ్డి, శివ పాల్గొన్నారు.
టీడీపీ నేతలపై కేసు నమోదు
వేంపల్లె : స్థానిక సాయినగర్ వీధిలో ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఇంటిపైకి దాడి చేయడానికి వచ్చాడని చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగారావు తెలిపారు. ఆదివారం శ్రీనాథ్‌రెడ్డి సతీమణి విజయ భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త శ్రీనాథ్‌రెడ్డి ఇంటిలో లేని సమయంలో టీడీపీ నేతలు గొడవ పడడానికి ఇంటిపైకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురితోపాటు మరికొందరి టీడీపీ నేతల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment