రైతుల తరఫున పోరాటం చేస్తాం
మైలవరం: దాల్మియా ప్రభావిత గ్రామాలైన దుగ్గనపల్లి, నవాబుపేట గ్రామ రైతు సమస్యలపై పోరాటం చేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రజాభిప్రాయ సేకరణ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. దుగ్గనపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు మోషే కుటుంబాన్ని గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎంపీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుగ్గనపల్లి,నవాబుపేట గ్రామాలకు ప్రధానంగా రెండు సమస్యలు పొంచి ఉన్నాయన్నారు. అందులో కాలుష్యం ఒకటి కాగా.. పంటల నీట మునక మరో ప్రధాన సమస్య అని తెలిపారు. ఈ విషయంపై రైతులు లోకాయుక్తను ఆశ్రయించగా అందుకు సంబంధించిన పూర్తి నివేదక కోసం కమిటీ వేశారన్నారు. అది పూర్తి కాకముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసి పరిశ్రమ విస్తరణకు ముందుకు సాగడం మంచిదికాదన్నారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామాలలో ఉన్న సమస్యలపై పార్టీ తరపున కలెక్టర్‌ను కలిసి వివరిస్తామన్నారు. 27వ తేదిన తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసేదుకు ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం రెండు గ్రా వ ూ లకు సంబంధించిన మునక భూములు, దుమ్మూ, ధూళి నిండిన పొలాలను పరిశీలించారు.
ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
దాల్మియా పరిశ్రమ విస్తరణకు సంబంధించి ఈనెల 27వతేదిన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయకపోతే ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కారం కావని.. ఆపై యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. నవాబుపేట నాయకులు భాస్కర్‌రెడ్డి, చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిద కొమెర్ల మోహన్‌రెడ్డి, కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, గిరిధర్‌రెడ్డి, శివగుర్విరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వెంపలాకు రామాంజనేయుల యాదవ్, జడ్పీటీసీ మహాలక్ష్మీ, హృషికేశవరెడ్డి ,శంకర్‌రెడ్డి,చిన్నయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టీకరణ
రెండు లక్షల పరిహారం అందజేత
రైతు మోషే కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మోషే కుమారుడు ఏలియాజర్, కుమార్తెలు దీవెనమ్మ, మణి కుమారిలకు రెండు లక్షల పరిహారం అందించారు. ఎప్పుడు ఏ ఆపదొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment