
అన్ని ప్రభుత్వ శాఖల యందు ‘వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార
కడప రూరల్: జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఇది జోన్–4 కార్యాలయం. రాయలసీమ జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 17 కేడర్‌లు, 13 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ శాఖ పరిధిలోకి వస్తారు. ఇక్కడ ఉద్యోగుల పదోన్నతులతో పాటు సర్వీసుకు సంబంధించిన అంశాలు వస్తాయి. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగ నియామకాలను చేపడుతుంటారు. ఈ జాబితా ఈ శాఖ ఎంత కీలకమైందో చెప్పకనే చెబుతోంది. ఇలాంటి ముఖ్యమైన శాఖలో పనిచేయడానికి ఉద్యోగులు తహ తహలాడుతుంటారు. ఇక్కడ ఏది జరిగినా కూడా ఆ అంశం జోన్–4 (రాయ లసీమ) వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది.
ఇక్కడికి రావడానికి అనేక ప్రయత్నాలు...
సాధారణంగా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్‌లు అంటే ‘వర్క్ లోడ్’(పని భారం) ఎక్కువగా ఉన్నప్పుడు సంబంధిత అధికారి తమకు ఉద్యోగుల అవసరం అని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. వారి ఆదేశాల ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్న తమకు అనుకూలమైన ‘అన్ని పనులు తెలిసిన’వారిని రప్పించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇక్కడి వైద్య ఆరోగ్య శాఖలో పని భారం ఉన్నా..లేకున్నా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్‌లపై కోరుకున్న చోటికి రప్పించుకోవడం ఒక సాకుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
● ప్రొద్దుటూరు సమీపంలోని ఒక పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్, తిరుపతిలో ఒక విభాగంలో పనిచేస్తున్న మరొక సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఆర్డర్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి రావడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఇక్కడి నుంచి ఫైల్స్ వెళ్లాయి. అక్కడి ఉన్నతాధికారులు ఆ ఫైల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ వర్క్ ఆర్డర్ జరుగుతుందా..లేదా అనేది పక్కనబెడితే.. తాజాగా ప్రభుత్వం వర్క్ ఆర్డర్స్, డిప్యుటేషన్‌లపై ‘బ్యాన్’విధించింది. అయినా ఇందుకు సంబంధించిన పత్రాలు వెళ్లడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే ఇక్కడ పనిచేసి వెళ్లిన మరొక ఉద్యోగి కూడా మళ్లీ ఇక్కడికే రావడానికి చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ శాఖలో పనిచేయడానికి ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. ఈ విధంగా మొదటి నుంచి ఉదో ్యగులు ఈ శాఖలో పోస్టింగ్ పొందడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఏదోలా ఇక్కడికి వచ్చాక ‘ఫెవికాల్ వీరుల్లా’మారిపోతారు. వెళ్లాల్సి వస్తే మళ్లీ రావడానికి అడ్డదారులు వెతుకుతారు. అందుకే ఈ శాఖలో పోస్టింగ్‌కు సంబంధించి ‘కదలరు..వదలరు’అని అం టుంటారు. మరి అందరికే ఇదే ఎందుకిష్టమంటే ‘పైసా మే పరమాత్మ’ అనే గుసుగుసలు వినిపిస్తాయి.
నేతల మధ్య ఆధిపత్యం..
అక్కడికి పోస్టింగ్ అంటే ఉబలాటం
వచ్చాక వెళ్లకుండా ఉండడానికి ఆరాటం
గత్యంతరం లేక వెళ్లాల్సివస్తేమళ్లీ రావడానికి ప్రయత్నం
ఇదీ ౖ‘వెద్య ఆరోగ్య శాఖజోన్–4 కార్యాలయం’తీరు
వైద్య ఆరోగ్య శాఖ విభాగాలకు సంబంధించి రాయలసీమ (జోన్–4) జిల్లాల్లో ఆరుకు పైగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కొన్నింటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరు అవునంటే..మరొకరు కాదంటారు. అలాగే తమకు అనుకూలమైన వారిని కీలకమైన పోస్టింగ్‌ల్లో నియమించుకోవడానికి, అనుకూలమైన చోటికి బదిలీలు చేయించుకోవడానికి పోటీ పడుతుంటారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తించేలా అటు అధికారులు..ఇటు ఉద్యోగ సంఘాల నేతలు చూడాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు..ఉన్నతాధికారులు ఉద్యోగుల మాటలు ఆలకిస్తారో లేదో చూడాలి.

అన్ని ప్రభుత్వ శాఖల యందు ‘వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార

అన్ని ప్రభుత్వ శాఖల యందు ‘వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార
Comments
Please login to add a commentAdd a comment