వైఎస్సార్‌సీపీ ఆవిర్భావమే ఒక ప్రభంజనం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ 15వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషదాయకమన్నారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్ల ఈ పార్టీ పోరాటాల నుంచి పుట్టిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై ్క ఎన్నో రకాలుగా వేధించి, అవినీతి ఆరోపణలు చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 16నెలలు జైల్లో పెట్టారన్నారు, 2014లో 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా మారిందన్నారు. ఏదైనా ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన వెంటనే అధికారంలోకి రాకపోతే కనుమరుగవడం ఖాయమని, కానీ వైఎస్సార్‌సీపీ మొదటిసారి అధికారంలోకి రాకపోయినా 9 ఏళ్లు నిలబెట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. చిరంజీవిలాంటివారే రెండేళ్లకే పార్టీని అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఆయా సంక్షేమ పథకాలతో ఏపీలో ఎన్‌టీఆర్, వైఎస్సార్, వైఎస్ జగన్ ముగ్గురు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచారన్నారు. విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేసి మెడికల్ సీట్లు సాధిస్తే వాటిని వద్దని లేఖ రాసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేని ధ్వజమెత్తారు. 2024లో వైఎస్సార్‌సీపీ సంఖ్యాపరంగా ఓటమిపాలైనా 40 శాతం ఓట్లతో ప్రజల మనసు గెలుచుకుందన్నారు. జిల్లాలోని కాశినాయన క్షేత్రంలో అన్న సత్రాలు కూల్చివేస్తుంటే ...ధర్మాని పరిరక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంపద సృష్టించి ఎన్నికల హామీలు అమలు చేస్తానన్న బాబు, ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పమంటున్నారని ఎద్దేవా చేశారు. జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు పులి సునీల్, పి. జయచంద్రారెడ్డి, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
అధికారంలోకి రాకపోయినా 9 ఏళ్లు పార్టీని నడపడం సామాన్య విషయం కాదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment