వారు నిరాశ్రయులు.. కన్నవారిని.. కన్న ఊరును వదిలేసి వచ్చిన వలస జీవులు. పగలంతా ఏదో ఒక పని చేసుకుని.. రాత్రయ్యే సరికి ఇదిగో ఇలా ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తుంటారు. అయిన వారికి.. ఆత్మీయులకు దూరంగా ఉంటున్న వీరి బతుకులకు ఎలాంటి ధీమా లేదు.. వీరు సేద తీరుతున్న చోట గోడపైన ఉన్న జీవిత బీమా ప్రకటన చూసిన వారు ఏ బీమా వర్తించని బతుకులు వీరివే కదా అంటూ ఓ క్షణం ఆగి.. ఆలోచించి వెళ్లిపోతున్నారు. కడప నగరంలో ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో సాక్షి కంట పడిన దృశ్యమిది.
– ఎస్‌కే మొహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప.