కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అక్రమాల ఆరోపణలపై ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’ కథనంపై రాష్ట్ర స్థాయి క్షయ నియంత్రణ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం స్ధానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్ హల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ నాగరాజు, డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరకుమార్, ఇద్దరు ఆఫీస్ సూపరెండెట్లు విచారణ చేపట్టారు. క్షయ నియంత్రణ విభా గం జిల్లా కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బందిని విచారణకు పిలిపించారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు అంశాలను.. ఆసక్తికరమైన విషయాలను విచారణ అధికారుల దృష్టికి తెచ్చినట్లుగా తెలిసింది. అధికారులు చేపుడుతున్న విచారణ..అందుకు సంబంధించి ఉన్నతాధికారులకు సమర్పించే నివేదిక..తదుపరి చర్యలపై ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.