– జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు
కడప సెవెన్‌రోడ్స్ : భారతీయ నైతికతలో సమర్థవంతమైన పౌర సేవను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులు ఓర్పు, నేర్పుతో ఉద్యోగ విధులు నిర్వహించే లక్ష్యంతో ‘మిషన్ కర్మయోగి’ ఆన్‌లైన్ అభ్యాస వేదికను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కర్మయోగి పోర్టల్’ నిర్వహణపై అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్వో విశ్వేశ్వర నాయుడు తోపాటు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి హజరతయ్య హాజరై పోర్టల్ నిర్వహణపై పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. మిషన్ కర్మయోగి – నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్‌పీసీఎస్‌సీబీ) సివిల్ సర్వీస్ అధికారులకు కర్మయోగి భారత్ పోర్టల్‌ను భారత ప్రభుత్వం అందిస్తుందన్నారు. మిషన్ కర్మయోగి న్యూ ఇండియా దార్శనికతకు అనుగుణంగా సరైన వైఖరి, నైపుణ్యాలు మరియు జ్ఞానంతో కూడిన భవిష్యత్తు నిర్మాణం కోసం పౌర సేవను నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయన్నారు. అధికారుల భవిష్యత్తును పటిష్టం చేసి దిశగా.. నిరంతరం ఎప్పుడైనా–ఎక్కడైనా నేర్చుకునేలా బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పౌర సేవల సామర్థ్య నిర్మానాత్మక వ్యూహంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కర్మయోగి భారత్ దార్శనికత, భారత పౌర సేవల సామర్థ్య నిర్మాణ దృశ్యాన్ని మార్చడం, తద్వారా అధికారులు భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి, ఎప్పుడైనా–ఎక్కడైనా నిరంతర అభ్యాసాన్ని అనుమతించే బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.కర్మయోగి పోర్టల్‌ను ప్రతి ఉద్యోగి, అధికారి సీఎఫ్‌ఎంఎస్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేసుకోవాలన్నారు. మిషన్ కర్మయోగి ప్రభుత్వం–పౌరుల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం, అధికారులు పౌరులకు మరియు వ్యాపారానికి సహాయకులుగా మారడం, ప్రవర్తనా–కార్యాచరణ–డొమైన్ సామర్థ్యాల అభివృద్ధి ద్వారా జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యానికి దారితీస్తుంది. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరనాథ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.