దాల్మియా పరిశ్రమతో వెలువడే బూడిద, కెమికల్ వాసనతో నా కోడలికి క్యాన్సర్ సోకి మరణించింది. మా మిరప పంట దిగుబడుల్లో నాణ్యత లేదని గిట్టుబాటు ధర లభించలేదు. అప్పులు తీర్చలేక నా కుమారుడు మోషే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఫ్యాక్టరీ యాజమాన్యమే. ఇప్పుడు ఇద్దరి పిల్లల బాధ్యత నాపై పడింది.
– స్వామిదాసు, దుగ్గనపల్లి, మైలవరం మండలం
గ్రామంలో ప్రతిఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు
పరిశ్రమ నుంచి వెలువడే ధూమ్ము, ధూళి, కెమికల్ వాసనతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. మా సమస్యలు దాల్మియా యాజమాన్యం, అధికారులకు వివరించినా ఎవరూ స్పందించలేదు. ఇళ్లలో బూడిద పడడంతో మా ఇళ్లకు బంధువులు రావడం మానేశారు. అదికారులు మా సమస్యలకు పరిష్కారం చూపకపోతే దాల్మియా పరిశ్రమ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం.
– మేరి, దుగ్గనపల్లి, మైలవరం మండలం