
సామాజిక అడవిలో మంటలు
కమలాపురం : మండలంలోని రామచంద్రాపురం సమీపంలో ఉన్న సామాజిక అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న తాటి చెట్ల నుంచి తాటి పట్టలు రాలి పోయి ఎండిపోయాయి. గుర్తు తెలియని ఆకతాయిలు వాటికి నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతూ చుట్టు పక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్‌తో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.