
రూ.500 దొంగనోటు ఇచ్చి పరారీ
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో గత రెండు రోజులుగా దొంగ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కుందూనది వద్ద చాపాడుకు చెందిన శాంతమ్మ దోస పండ్ల వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి బైక్‌లో వచ్చి రూ.100లకు దోస పండ్లు కొనుగోలు చేశాడు. రూ.500 నోటు ఇచ్చి రూ.400 చిల్లర తీసుకుని వెళ్లాడు. ఇంతలో పిల్లలు అది దొంగ నోటుగా గుర్తించి వెతికేలోగా బైక్‌లో వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. సోమ వారం చాపాడులోని ఓ స్వీట్స్ బేకరిలో స్వీట్లు కొనుగోలు చేసిన వ్యక్తి దొంగనోటు మార్చుకుని పరారైనట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో దొంగ నోట్లు చలామణీ కావడంతో చాపాడుకు చెందిన ఎస్.ఓబులేసు ట్రైనీ డీఎస్పీ భవానీకి ఫిర్యాదు చేశారు.