
ఎవరిదీ ‘చెత్త’పని?
కడప కార్పొరేషన్ : కడపలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీకి అవమానం జరిగింది. నగరంలోని రాజీవ్ పార్కు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద స్థానిక వ్యాపారులు చెత్త వేస్తున్నారు. ఎవరి వద్ద ఏర్పడిన చెత్తను వారే ఎత్తాలని నిబంధన ఉన్నా ఎవరికి వారు చెత్త ఎత్తకుండా ఇదిగో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట వేస్తున్నారు. దీన్ని నగరపాలక సిబ్బంది కొన్ని సార్లు ఎత్తేస్తున్నా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే వారు ఇలాగే వేయడం వల్ల నగరపాలక సిబ్బంది ఎత్తడం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇలా విగ్రహం ముందు భాగమంతా చెత్తమయంగా మారింది.