విద్యార్థిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Apr 4 2025 12:43 AM | Updated on Apr 4 2025 12:43 AM

విద్య

విద్యార్థిని అదృశ్యం

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన ముత్తులూరు ప్రత్యూష (16) అనే విద్యార్థిని కనిపించడం లేదని తల్లి ప్రభావతి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రామక్రిష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీనగర్‌కు చెందిన ముత్తులూరు ప్రత్యూష పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంగడికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రానట్లు గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లి ప్రభావతి ఫిర్యాదు చేసింది.

రేషన్‌షాపు సీజ్‌

కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని రేషన్‌షాపును సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ శివశంకర్‌ తెలిపారు. 25 క్వింటాళ్లు బియ్యం, 75 కేజీల చక్కెర స్టాకులో తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో

ఆటో డ్రైవర్‌ మృతి

జమ్మలమడుగు రూరల్‌ : ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఎస్‌. మహమ్మద్‌ అజీజ్‌ (40) అనే ఆటో డ్రైవర్‌ అనుమానస్పదంగా మృతి చెందాడు. ఎస్‌ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహమ్మద్‌ అజీజ్‌ గురువారం ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగుకు బాడుగ కోసం వచ్చాడు. తిరిగి ప్రొద్దుటూరుకు వెలుతుండగా దానవులపాడుకు రాగానే అకస్మాత్తుగా ఆటోలోనే మృతి చెందాడు. అయితే కొంతకాలంగా అజీజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం.

నకిలీ ఫోన్‌ పే మోసగాళ్ల అరెస్ట్‌

చాపాడు : నకిలీ ఫోన్‌ పే యాప్‌ ఉపయోగించి మూడు నెలలుగా జనరల్‌ స్టోర్‌లో మోసం చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ భవానీ వివరాలు వెల్లడించారు. చాపాడులోని నక్కలదిన్నె రోడ్డులో గల పెంచల నరసింహా జనరల్‌ స్టోర్‌లో.. చాపాడుకు చెందిన ముత్యాల శివశంకర్‌, లక్ష్మీపేటకు చెందిన భూమిరెడ్డి వీరాంజనేయరెడ్డి, సీతారామాపురానికి చెందిన సాయి గత మూడు నెలలుగా నకిలీ ఫోన్‌ పే యాప్‌ ద్వారా సరకులు కొనుగోలు చేస్తూ మోసానికి పాల్పడ్డారు. రూ.3 లక్షల వరకు సరకులు తీసుకెళ్లడంతోపాటు కత్తితో బెదిరించిన ఘటనపై బుధవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి శివశంకర్‌, వీరాంజనేయరెడ్డి, సాయిలను అరెస్ట్‌ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్‌, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ చిన్న పెద్దయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని అదృశ్యం  1
1/2

విద్యార్థిని అదృశ్యం

విద్యార్థిని అదృశ్యం  2
2/2

విద్యార్థిని అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement