
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(45) రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
హాకీ టోర్నీలో ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీలో విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడిన కాకినాడ జట్టు ఆది నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారులు ద్వితీయ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రవిచంద్ర, సెక్రటరీ శేఖర్, డైరెక్టర్ శ్రీనివాసులు అభినందించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ జిల్లా జట్టుకు ధర్మవరం షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు వీరనారాయణ, మూడో స్థానంలో నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుకు చేనేత నాయకురాలు జయశ్రీ బహుమతులు, ట్రోఫీలను అందించారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి