
మద్యం దుష్ప్రభావాలపై అవగాహన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో మద్యం దుష్ప్రభావాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో కేర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. శనివారం నగర శివార్లలోని రిమ్స్‌లో డీ –అడిక్షన్ సెంటర్‌లో బాధితులకు మద్యం దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్య విముక్తి సమాజంగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్, కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కృష్ణకుమార్ వైద్య, సిబ్బంది పాల్గొన్నారు.