
●రసవత్తరంగా సాగిన బండలాగుడు పోటీలు
స్థానిక దర్గా–ఏ–గఫారియాలో జరుగుతున్న అబ్దుల్ గఫార్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాడుగు పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన 11 కాండ్ల జతల ఎడ్లు పోటీలో తలపడ్డాయి. ఇందులో ప్రొద్దుటూరు అయోధ్య నగర్‌కు చెందిన బీసీఎస్‌ఆర్ బుల్స్ అధినేత వెంకటసాయి భవిత్‌రెడ్డి ఎడ్లు 5107 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా పెద్ద కొట్టాలకు చెందిన బోరెడ్డి నారాయణరెడ్డి ఎడ్లు 4694 అడుగులతో ద్వితీయ స్థానంలో, దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన టి.అశోక్ ఎడ్లు 4600 అడుగులతో తృతీయ స్థానంలో, కమలాపురం మండలం జంగంపల్లెకు చెందిన నాగ సుబ్బారెడ్డి ఎడ్లు 4470 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. కాగా నిర్వాహకులు విజేతలకు దాతల సహకారంతో వరుసగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు అందజేశారు.

●రసవత్తరంగా సాగిన బండలాగుడు పోటీలు