పులివెందులకు రైలుకూత! | - | Sakshi
Sakshi News home page

పులివెందులకు రైలుకూత!

Nov 2 2025 9:06 AM | Updated on Nov 2 2025 9:36 AM

65 కిలోమీటర్ల దూరమే..

రాజంపేట: పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సంగతి విధితమే. ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గం నిర్మాణంతో దశాబ్ధాలుగా పులివెందుల వాసులు ఎదురు చూస్తున్న రైలుకూతకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం కడప–బెంగళూరుకు మరో రైలుమార్గంగా నిలవనుంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో ముద్దనూరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ స్టేషన్లకు కనెక్టివిటీ రైల్వేలైన్‌గా మారబోతుంది. ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య రైల్వేలైన్‌ నిర్మితం చేయనున్నారు.

● పులివెందుల మీదుగా ఈ మార్గం ప్రణాళిక చేయడం ద్వారా కడప జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలు పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేగంగా ఎదగనున్నాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్యానవనపంటలు, ఖనిజసంపద,బొగ్గు వంటి వనరుల రవాణా సులభతరం అవుతుంది. ఎలక్ట్రానిక్‌, సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమలు రాయలసీమలో స్ధిరపడటానికి ఈ లైన్‌ మౌలిక సదుపాయంగా నిలుస్తుంది.

● ఈ రైలుమార్గం నిర్మితం కానున్న నేపథ్యంలో నాలుగో జంక్షన్‌గా ముద్దనూరు రైల్వేస్టేషన్‌ నిలవనుంది. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా రైలుమార్గంలో ఓబులవారిపల్లె, కడప, ఎర్రగుంట్ల జంక్షన్లు ఉన్నాయి.

సీమలో రవాణా సౌకర్యాలు...

ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం జరగనుంది.ఈ లైన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు విస్తృతమవుతాయి.

ముద్దనూరు–ముదిగుబ్బ ప్రాంతాల మధ్య 65 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బడ్జెట్‌లో రైలుమార్గం ఆర్‌ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు.ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌ గుంతకల్‌–బెంగళూరు రైలుమార్గంలో ఉంది. జిల్లాలోని ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్‌ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో సంబంధిత రైల్వే విభాగం అఽధికారులు డీపీఆర్‌ (డిటైయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేశారు.రైల్వేబోర్డుకు డీపీఆర్‌ వెళ్లింది.

2020లో అప్పటి రైల్వేబడ్జెట్‌లో

ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైన్‌ను

రైల్వేమంత్రిత్వ శాఖ తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్‌లో సర్వే కోసం అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. 2025 బడ్జెట్‌లో కొత్తలైన్‌కు ఆర్‌ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు.

ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గానికి రైల్వేబోర్డుకు ఆమోదం తెలిపింది. రైలుమార్గం నిర్మితం కోసంప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ,2,505,89 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం ద్వారా నాలుగు నుంచి ఐదుగంటలు పట్టే ప్రయా ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

నాలుగో జంక్షన్‌గా ముద్దనూరు

ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య లైన్‌

అంచనా వ్యయం రూ.2,505.89 కోట్లు

పులివెందులకు రైలుకూత! 1
1/1

పులివెందులకు రైలుకూత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement