సెన్సార్ బోర్డు సభ్యురాలు, ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి... కో డైరెక్టర్ శరత్ కుమార్పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. తన సన్నిహితుడు కిషన్‌తో కలిసి ఆమె శుక్రవారం శరత్ను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.