co-director sarath
-
దర్శకుడిపై ఫ్యాషన్ డిజైనర్ దాడి
మంగారెడ్డిపై క్రిమినల్ కేసు హైదరాబాద్: వర్ధమాన దర్శకుడు పోలవరపు శరత్‌కుమార్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేశారు. వీడియో ఎడిటింగ్‌కు ఒప్పుకోలేదన్న కారణంతో... గురువారం అర్ధరాత్రి 12.45 ప్రాంతంలో ఆమె సన్నిహితుడు కిషన్‌తో కలిసి రాడ్‌తో శరత్‌కుమార్ తలపై బలంగా కొట్టారు. అందవికారుడిగా చేయాలనే ఉద్దేశంతో అతడి జుత్తు కత్తిరించారు. సెల్‌ఫోన్ ధ్వంసం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఐపీసీ సెక్షన్ 324, 448 కింద క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివి... నిజాంపేట బాలాజీనగర్‌లో ఉండే ఫిలింమేకర్ శరత్‌కుమార్ కమలాపురికాలనీలోని తన స్నేహితుడు రాకేష్ ఇంటికి వస్తుంటారు. గతంలోనే పరిచయమున్న మంగారెడ్డి చాటింగ్‌లోకి వచ్చి.. వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలని శరత్‌కుమార్‌ను కోరారు. తనవల్ల కాదని శరత్ చెప్పారు. ఆగ్రహించిన మంగారెడ్డి గురువారం అర్ధరాత్రి తన సన్నిహితుడు కిషనతో వచ్చి స్నేహితుడి గదిలో నిద్రిస్తున్న శరత్‌పై రాడ్‌తో దాడి చేశారు. అడ్డువచ్చిన అతని స్నేహితుడు రాకేష్నూ కొట్టారు. శరత్ జుత్తు కత్తిరించి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని స్థానిక నిఖిల్ ఆసుపత్రికి తలరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలంటే చిన్నచూపు: పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగారెడ్డి శుక్రవారం బంజారాహిల్స్ పోలీ స్ స్టేషన్‌కు వచ్చారు. ఘటనపై ఆమె స్పందిస్తూ... తరచూ అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న శరత్‌ను నిలదీసేందుకే అతని ఫ్లాట్‌కు వెళ్లానన్నారు. తలుపు నెడుతున్న క్రమంలో శరత్ తలకు తాకిందని, దాంతో అతను వెనకాలున్న బీరువాకు కొట్టుకున్నాడన్నారు. తాను దాడి చేశాననడంలో వాస్తవం లేదన్నారు. శరత్‌పై తానూ కేసు పెడతానన్నారు. కాగా, శరత్‌కుమార్ చిత్రం ‘శీష్‌మహల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
కో-డైరెక్టర్ పై డిజైనర్ మంగారెడ్డి దాడి!
హైదరాబాద్ : సెన్సార్ బోర్డు సభ్యురాలు, ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి... కో డైరెక్టర్ శరత్ కుమార్‌పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. తన సన్నిహితుడు కిషన్‌తో కలిసి ఆమె శుక్రవారం శరత్‌ను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేశానని మంగారెడ్డి చెబుతోంది.. శరత్ ఫోన్లో అసభ్యకరసందేశాలు పంపిస్తూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై నిలదీసేందుకు శరత్ వెళ్లానని అయితే అతను తనపై దాడికి దిగాడని దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంగారెడ్డి మాట్లాడుతూ 'ఆడవాళ్లంటే శరత్‌కు గౌరవం లేదు. అమ్మాయిలు ఛండాలంగా డ్రస్ చేసుకుంటారని రోజూ నాకు ఎస్ఎంఎస్లు పంపేవాడు. తనతో మాట్లాడవద్దని, చెప్పినా... శరత్ మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అతడి ప్రవర్తనకు విసిగిపోయా. నిలదీసేందుకు శరత్ వెళ్లాను. అయితే అతడు నన్ను కొట్టడానికి మీదకు వచ్చాడు. నా డ్రస్ లాగి అసభ్యకరంగా మాట్లాడాడు. అలా మాట్లాడవద్దని నేను కూడా అరిచాను. నన్ను కొట్టడానికి రాబోతే ఆత్మరక్షణ కోసం అతడిని తోశాను. దాంతో శరత్ తల కూలర్‌కు తగిలింది. రాడ్‌తో దాడి చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు అలా కొట్టడాలు ఏమీ లేవు. ఎవరూ కొట్టలేదు. కొట్టుకోలేదు. శరత్ ఫుల్‌గా తాగి ఉన్నాడు. అతడికి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పటివరకూ నేను శరత్ మీద ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. 'హీ ఈజ్ నాట్ మై ఎనిమీ' నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంతకన్నా మాట్లాడటానికి ఏమీ లేదు' అని తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కో-డైరెక్టర్ పై డిజైనర్ మంగారెడ్డి దాడి!