తెలంగాణలో తొలి ఎన్‌కౌంటర్ | 2 Maoists Gunned Down in Telangana's Warangal | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 16 2015 6:41 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... మరణించిన వారు తంగెళ్ల శ్రుతి (23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్‌గా తెలిసింది. గోవిందరావుపేట-తాడ్వాయి మండలాల సరిహద్దులోని రంగాపురం సమీపంలోని బోడగుట్టపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో శ్రుతి, సాగర్ మరణించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement