క్షణక్షణానికి పెరుగుతున్న వరద.. నడివాగులో ఓ బండపై బిక్కుబిక్కుమంటూ 14 మంది.. పది నిమిషాలైనా ఘోరం జరిగిపోయేది! కానీ గ్రామస్తుల సాహసంతో వారంతా బతికి బయటపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కచికంటి పెద్దవాగులో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లింది. వీరిలో నలుగురు వృద్ధులు, ఓ యువతి, మహిళ, ఓ వ్యక్తితో పాటు 7 నుంచి 12 ఏళ్లలోపు ఏడుగురు అబ్బారుులున్నారు. వృద్ధులు ఒడ్డున ఉండి దుస్తులు ఆరేస్తుండగా.. మిగతా వారు వాగులో దిగి బట్టలు ఉతుకుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అందరూ ఆందోళనకు గురై ఒకచోటికి చేరి బండపై నిల్చున్నారు.