ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆకాశరామన్న లేఖ కలకలం రేపింది. టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఆకాశరామన్న ఉత్తరం వెలుగులోకి రావడంతో అధికార పార్టీ ఉలిక్కి పడింది. ఈ లేఖలను బాధితులు శనివారం గ్రామంలో పంచారు.