క్యుములోనింబస్ మేఘాలు రాజధానిని వెంటాడుతూనే ఉన్నాయి. శనివారం కూడా భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లు, కాలనీలు, బస్తీల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.