‘‘కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా హోదా వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. అందరూ చెబుతున్నట్టు పారిశ్రామిక రారుుతీలేమీ రావు. హోదా వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని నిరూపిస్తే దేనికై నా సిద్ధం. హోదా కంటే మెరుగైనది కాబట్టే ప్యాకేజీని తీసుకుంటున్నాం’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జన చైతన్య యాత్రలో భాగంగా గురువారం విశాఖ జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్ నుంచి జూనియర్ కళాశాల వరకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో టీడీపీ విసృ్తతస్థారుు సమావేశం పేరిట నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నాను. బాబు రాకపోతే ఉన్న జాబులు ఊడిపోరుు ఉండేవి. నేడు ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే అదంతా నా చలవే’’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.