మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 26మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మెక్సికో, టల్టెపెక్ బాణాసంచా మార్కెట్ కి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఇంతలోనే భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.