బిల్లీ రావు అసలు పేరు అహోబల రావు. పుట్టింది కృష్ణా జిల్లా కొండపల్లి. మద్రాస్ ఐఐటీలో చదివాక... అమెరికా వెళ్లి చదువుకుని ఇక్కడికి తిరిగి వచ్చేశారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ ఏ అంశంపై అయినా అన్నీ తెలిసినట్లే మాట్లాడే బిల్లీ రావు... 1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే... చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్న సమయంలోనే పరిచయమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి బంధం బలపడుతూ వచ్చింది. వివిధ దేశాల్లో విసృ్తతంగా పర్యటించటం, పెద్దపెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం బిల్లీ హాబీ. ఇదే క్రమంలో ఈయనకు ఫ్లోరిడాలోని ఐఎంజీ యాజమాన్యమైన మార్క్ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూక్రీగర్ పరిచయమయ్యాడు. బాబుకు క్రీగర్‌ను పరిచయం చేసి... ఆయన్ను ఐఎంజీబీకి నామమాత్రపు చైర్మన్‌గా చేసి... బాబు- బిల్లీ ఇద్దరూ చక్రం తిప్పారు. ఐఎంజీబీకి భూములు దక్కాక... క్రీగర్‌ను నేరస్తుడనే ముద్ర వేసి కంపెనీ నుంచి తొలగించటంతో ఆయన బిల్లీపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ బిల్లీ-బాబుల బంధం, బలం తెలిశాక తప్పుకున్నారు. అదీ కథ. అలాంటి బిల్లీకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో... ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రాజెక్టును మొదట అప్పగించారు. అదెంత ఘోరంగా విఫలమైందంటే... దాన్ని గురించి మాట్లాడటానికే సిగ్గుపడేంత. కావాలంటే మీరే చూడండి..