IMG
-
ఐఎంజీ భూములపై సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, సాక్షి: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు భూముల అక్రమ కేటాయింపుపై విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఐఎంజీకి కేటాయించిన భూములపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలు జరిగినట్లు సరైన అధారాలు లేవని హైకోర్టు తేల్చింది. 2004కు ముందే ఐఎంజీకి 850 ఎకరాలు భూమి కేటాయించినట్లు తెలిపింది.సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన విచారణలో.. ఐఎంజీ భూముల ఆక్రమ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసిట్లు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించింది.‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. 5 రోజులకే 850 ఎకరాలు... ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
రిలయన్స్ చేతికి ఐఎమ్జీ–ఆర్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఈవెంట్లను నిర్వహించే ఐఎమ్జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్జీ–ఆర్)లో ఐఎమ్జీ వరల్డ్‌వైడ్ కంపెనీకి ఉన్న 50 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం రూ.52.08 కోట్లు అంతా నగదు రూపంలోనే వెచ్చించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. డీల్‌లో భాగంగా ఐఎమ్జీ–ఆర్‌లో ఐఎమ్జీ సింగపూర్ పీటీఈ లిమిటెడ్‌కు షేర్లను కొనుగోలు చేయనున్నామని, ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని వివరంచింది. ఈ డీల్ పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఐఎమ్జీ–ఆర్ మారుతుందని, దానిని రీబ్రాండ్ చేస్తామని తెలిపింది. ఈ డీల్‌కు ప్రభుత్వ, నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం లేదని ఈ ఏడాదిలోనే ఈ డీల్ పూర్తవ్వగలదని పేర్కొంది. 2010లో ఏర్పాటు: ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఐఎమ్జీ వరల్డ్‌వైడ్ కంపెనీతో కలిసి రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్‌ను 2010లో ఏర్పాటు చేసింది. ఐఎమ్జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్జీ–ఆర్) పేరుతో సమాన భాగస్వామ్యాలతో ఈ జేవీ ఏర్పాటైంది. భారత్‌లో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఈవెంట్స్‌ల అభివృద్ధి. మార్కెటింగ్, నిర్వహణ కోసం ఈ జేవీని ప్రారంభించారు. -
జియోకి వ్యతిరేకంగా ఏకమైన టెల్కోలు
న్యూడిల్లీ: టెలికాం కంపెనీల మధ్య వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన రిలయన్స జియోపై టెలికాం దిగ్గజం కంపెనీలు పలు ఆరోపణలు గుప్పించాయి. జియోకి వ్యతిరేకంగా ఏకమైన దిగ్గజ కంపెనీలు దోపిడీధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఇంటర్మీడియాలిటీ గ్రూప్ (ఐఎంజీ) ముందు తమ వాదనను వినిపించాయి. శుక్రవారం ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో మాట్లాడిన కంపెనీలు, జియో వాస్తవికతను తప్పుగా చూపించిందన్నారు. దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు రిలయన్స్ జియో అధికారులకు అవాస్తవాలు చెప్పిందని ఆరోపించాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్ చేసి మార్కెట్ షేరును గెలుచుకోవాలని చూస్తోందంటూ ప్రత్యర్థి జియోపై మండిపడ్డాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్ టెల్ జియో "దోపిడీ ధర" విధానాన్ని స్వీకరించిందని ఆరోపించింది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్‌ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయిందని ఎయిర్టెల్ పేర్కింది. దీన్ని నిరోధించాలని ఐఎంజీని కోరింది. అంతేకాదు, టెలికాం నియంత్రణాధికారి ట్రాయ్ కోర్టులో అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇంటర్కనెక్షన్ యూసేజ్ ధరలను నియంత్రిచాలని కోరాయి. లేదంటే తమకు "కోలుకోలేని ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు జీఎస్టీ పన్ను విధానంపై కూడా కంపెనీలు స్పందించాయి. ఇతర ప్రధాన రంగాల లాగానే, 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోరారు. టెలికాం సేవంలపై 5శాతం జీఎస్టీ పన్ను ఉండాలన్న వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని రద్దు చేయడం ద్వారా లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ సూచించింది. -
ఉచిత ఆఫర్లను నిరోధించండి
♦ జియో ఆఫర్ల వల్లే టెలికం రంగానికి కష్టాలు ♦ టెర్మినేట్ కాల్ చార్జీలు పెంచాలి ♦ ఐఎంజీకి మూడు టెలికం కంపెనీల నివేదన న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా మరోసారి టెలికం కంపెనీలు గళం విప్పాయి. ఎయిర్‌టెల్‌తో పాటు, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ కంపెనీలు అంతర మంత్రిత్వ శాఖ(ఐఎంజీ–ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్)తో విడివిడిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల వల్లే టెలికం రంగం తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలను, జీఎస్టీని తగ్గించాలని ఈ మూడు టెలికం కంపెనీలు ముక్తకంఠంతో కోరాయి. . కాల్ కనెక్ట్ చార్జీలు(ఐయూసీ–ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీ) ప్రస్తుతం నిమిషానికి 14 పైసలుగా ఉందని, ఇది వ్యయం కంటే తక్కువని, దీనిని సవరించాల్సి ఉందని, దీంతో పాటు మరికొన్ని సూచనలను ఈ కంపెనీలు చేశాయి. వివరాలు.... కాల్ టెర్మినేట్ చార్జీలు పెంచాలి.. రిలయన్స్ జియో అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను నిర్ణయిస్తోందని భారతీ ఎయిర్టెల్ విమర్శించింది. టెలికం కంపెనీల నెట్‌వర్క్‌ల్లో టెర్మినేట్ అయ్యే కాల్స్ చార్జీలను పెంచాలని కూడా డిమాండ్ చేసింది. టెర్మినెట్ అయ్యే కాల్స్‌కు ఎంత మొత్తం వ్యయం అవుతుందో అంత మొత్తాన్ని ఇతర టెలికం కంపెనీలు చెల్లించేలా చూడాలని సూచించింది. ఫ్లోర్‌ప్రైస్ నిర్ణయించాలి... ఐయూసీను సవరిస్తే, అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను ఆఫర్ చేయడం నిరోధించడం కుదురుతుందని ఐడియా సెల్యులర్ పేర్కొంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని, వాయిస్, డేటా టారిఫ్‌లకు ఫ్లోర్‌ప్రైస్(కనీస ధర)లను నిర్ణయించడం వల్ల అనుచిత రీతిలో ఆఫర్లను అందించడాన్ని నిరోధించవచ్చని సూచించింది. టెలికం రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన– ఐఎంజీ టెలికం కంపెనీలతో ఈ వారమంతా చర్చలు జరుపుతూనే ఉంది. జియోపై ఫిర్యాదును కొట్టేసిన సీసీఐ మరోవైపు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజాగా మరొకసారి జియోపై వచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదు ప్రధానంగా ఉచిత సేవలకు సంబంధించింది. జియో ఆఫర్లలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. కాగా సీసీఐ.. జియోపై వచ్చిన ఫిర్యాదులను తిరస్కరించడం ఇది రెండోసారి. ఇది ఇదివరకు ఎయిర్టెల్ చేసిన ఫిర్యాదును జూన్ 9న తోసిపుచ్చింది. -
ఇది బాబుగారి బిల్లీ!
-
బాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి..
-
'బాబు'గారి సొమ్మన్నట్టు..
-
బాబుగారి సొమ్మన్నట్టు..
రాష్ట్ర క్రీడారంగాన్నే బినామీకి రాసిచ్చేసిన బాబు నాలుగు రోజుల కంపెనీకి గచ్చిబౌలిలో 400 ఎకరాలు శంషాబాద్‌లో మరో 450 ఎకరాల భూమి ఎకరా రూ. 50 వేలకే; వాస్తవ విలువ ఎకరా 4 కోట్లపైనే కేబినెట్ అనుమతి లేకుండా ఆపద్ధర్మ హోదాలోనే కేటాయింపు రిజిస్ట్రేషన్ ఖర్చులు చెల్లించక్కర్లేదంటూ చంద్రబాబు వరం ‘ఐఎంజీ భారత’ మూలధనం కేవలం రూ. 5 లక్షలు ఐఎంజీ ఫ్లోరిడాకు అనుబంధమని చెప్పినా.. అంతా బోగస్ ఐఎంజీబీలో 99.9% వాటా బిల్లీరావుకి, 0.1% ఆయన సోదరుడికి దీనికి భూములతోపాటు 8 స్టేడియాలు కూడా అప్పగింత 45 ఏళ్ల పాటు హక్కులన్నీ బిల్లీ బోగస్ కంపెనీకే ఈ మధ్యలో కావాలంటే నిర్మాణ ధరకే కొనేసుకోవచ్చన్న బాబు స్టేడియాలకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మూడేళ్లు ఉచిత విద్యుత్, నీళ్లు ఇంకా కొన్ని వేల కోట్ల విలువైన వరాలిచ్చేసిన బాబు బిల్లీ బ్రదర్స్ ఇద్దరూ చంద్రబాబుకు కుప్పం నుంచే బినామీలు బాబుకు వంతపాడుతూ ఐఎంజీబీని ఆకాశానికెత్తిన ‘ఈనాడు’ ఇంత భారీ కుంభకోణంపై ఒక్కరోజూ పెన్నెత్తని రామోజీరావు ‘‘ఒక్క ఐఎంజీ కేసు చాలు. చంద్రబాబును చంచల్‌గూడ జైల్లో కూర్చోబెట్టడానికి’’ అని అన్నారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదెంత దగుల్బాజీ వ్యవహారమో. ఇదెంత దోపిడీనో. నిజం చెప్పాలంటే ఇది.. దేశం దాటేసిన దోపిడీ. అంతర్జాతీయ సంస్థల పేరు వాడుకుని, బాబు తన బినామీల ద్వారా మొత్తం రాష్ట్ర క్రీడా రంగాన్ని, వేలకోట్ల రూపాయల విలువైన భూముల్ని ఒక్క దెబ్బతో కాజేయడానికి పన్నిన కుట్ర. ‘ఈనాడు’ అధిపతి రామోజీకి ఏనాడూ కనిపించని, కనీసం రాయాలనిపించని మహాదోపిడీ. ఈ దొంగల నాటకాన్ని మీరే చూడండి.... ‘‘అటు వెళితే అడవి. క్రూరమృగాలు పీక్కుతింటాయి. ఇటు వస్తే హాయిగా హైవే ఎక్కొచ్చు’’ అంటూ చిన్నపిల్లలకు పిట్టకథ చెప్పినట్టుగా చెప్పారు చంద్రబాబునాయడు. దాన్ని ఎంచక్కా పొల్లుపోకుండా సీమాంధ్రలో పతాక శీర్షికలోను, తెలంగాణలో కాస్త దిగువగాను అచ్చేసేశారు రామోజీరావు. అంతేకాదు!! రోజుకో శీర్షికపెట్టి, తెలుగుదేశం గెలిచిపోతోందంటూ గాలికొట్టి, తానే మధ్యవర్తిగా ఉండి పొత్తులు కట్టి... ఇలా బాబు కోసం నానా యాతనా పడుతున్నారాయన. ఎన్ని చేస్తున్నా జనం బాబును నమ్మటం లేదన్న సంగతి రామోజీకి బాగా తెలుసు. అందుకే... జగన్మోహన్రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పటికే వేసేసిన చార్జిషీట్లను, ఇప్పటికే రాసేసిన రోత కథనాలను మళ్లీ వరుసగా అచ్చేస్తామంటూ మంగళవారం పత్రికాముఖంగా ప్రతిజ్ఞ కూడా చేసేశారు. మొత్తమ్మీద బాబుకు గాలికొట్టి, తనను కూడా బలమైన నేతగా చూపించడానికి తన శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు రామోజీరావు. మరి జగన్మోహన్రెడ్డిపై పేజీలకు పేజీలు కథనాలు వండేస్తున్న రామోజీరావు... చంద్రబాబు హయాంలో పెన్ను మూసుకున్నారేం? అప్పట్లో జరిగిన ప్రతి దోపిడీని, ప్రతి కుంభకోణాన్ని కూడా ప్రజలకు మహా మంచి జరుగుతున్నట్లుగా చూపించడానికి తాపత్రయపడ్డారెందుకు? ఐఎంజీ, ఏలేరు, మద్యం, పీపీఏలు, ప్రభుత్వ సంస్థల అమ్మకం, సహకార రంగాన్ని బొంద పెట్టడం.. ఇలా దేన్ని తీసుకున్నా అదంతా రాష్ట్రం మంచికోసమేనన్న కలరెందుకు ఇచ్చారు? తెలియటం లేదా రామోజీ పాత్రికేయ నీతి? 1995-2004 మధ్య ‘ఈనాడు’ తప్ప చెప్పుకోదగ్గ పత్రికన్నది ఉందా? మరి ఆ ‘ఈనాడే’ కన్ను మూసుకుని, పెన్ను మూసుకుని కూర్చుంటే ప్రజలకు దిక్కెవరు? 2008లో ‘సాక్షి’ ఆవిర్భవించాకే కదా.. బాబు చీకటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి! మరి ఇప్పటికీ ‘ఈనాడు’ వీటిని పట్టించుకోకుండా రాసిందే రాస్తుంటే ఏమనుకోవాలి? జగన్‌ను దెబ్బతీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదన్న నైరాశ్యం రామోజీలో కనిపించటం లేదా? 2004 ఫిబ్రవరి 12 హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ సంరంభం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అంతేకాదు! ‘‘ఐఎంజీ వచ్చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌కు, 2020 ఒలింపిక్స్‌కు ఇక్కడి నుంచే క్రీడాకారులు తయారవుతారు. ఆసియా అంతటి నుంచీ క్రీడాకారులు ఇక్కడికే వస్తారు’’ అంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. దానికి తన ఊహల్ని జోడించి రంగుల లోకాన్ని చూపించే బాధ్యతను ‘ఈనాడు’ పొల్లుపోకుండా నెరవేర్చింది. 700 కోట్ల పెట్టుబడి.. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా కాంప్లెక్స్... ఒలింపిక్స్ క్రీడాకారుల్ని తయారు చేసే సిబ్బంది.. అంటూ ఊదరగొట్టేసింది. పాపం జనం! వాళ్లకు అప్పట్లో ‘ఈనాడు’ రాసింది నిజమని నమ్మటం మినహా ప్రత్యామ్నాయం ఏముంది? అందుకే నమ్మారు! నిజమేననుకుని ఆనందపడ్డారు. కానీ వాళ్లకేం తెలుసు... ఇదో అంతర్జాతీయ కుంభకోణమని. వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని, అప్పటికే నిర్మించిన అద్భుతమైన స్టేడియాల్ని, వందల కోట్ల విలువైన రాయితీల్ని కాజేయడానికి పన్నిన పన్నాగమని. ఇదంతా అంతర్జాతీయ సంస్థల పేరిట బోగస్ కంపెనీలతో, బినామీలతో చంద్రబాబు ఆడిస్తున్న మహర్నాటకమని!!. తెరవెనుక జరిగిందేంటి? దీని వెనకున్న కుట్రేంటి? ఒకసారి చూద్దాం. ఐఎంజీ అకాడెమీస్ సంస్థ ఫ్లోరిడాలో ఉంది. దానికి చివరన ‘‘భారత’’ అనే తోక తగిలించుకుని పుట్టకొచ్చింది ఐఎంజీ అకాడెమీస్ భారత. ముద్దుగా ఐఎంజీబీ. ఈ కంపెనీ రిజిస్టరైంది 2003 ఆగస్టు 5న. అది కూడా... రూ.5 లక్షల మూలధనంతో. దీని యజమానులు కూడా బిల్లీరావు, ఆయన సోదరుడు ప్రభాకరరావు (పేటరావు). మొత్తం వెయ్యి షేర్లలో 999 షేర్లు బిల్లీరావువి కాగా... 1 షేరు ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేటరావుది. అంటే నూరుశాతం వీరిద్దరిదే. బాబు బినామీలదే. ఆగస్టు 5న రిజిస్టరయిన కంపెనీతో నాలుగు రోజులు కూడా తిరక్క ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంఓయూ కుదుర్చేసుకున్నారు. కనీసం కేబినెట్ అనుమతి కూడా లేదు. అయినా సరే బాబు స్వయంగా ఓకే చేసిన ఈ ఒప్పందం ప్రకారం... ఐఎంజీకి రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని... ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున కట్టబెడుతుంది. నిజం చెప్పాలంటే 2003 నాటికే ఇక్కడ ఎకరా రూ.4 కోట్ల వరకూ పలుకుతోంది. అంటే రూ. 1,600 కోట్ల విలువైన భూమిని జస్ట్ 2 కోట్లకు ఇచ్చేశారన్న మాట. రెండో విడతగా శంషాబాద్‌లోని మామిడిపల్లిలో మరో 450 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఇది కూడా ఎకరా జస్ట్ రూ.50 వేలకే. అప్పట్లో ఎకరా కనీసం రూ.కోటి ఉందని అనుకున్నా... అదో 450 కోట్లన్నమాట. {ఫీ రిజిస్ట్రేషన్: చిత్రమేంటంటే ఎకరా రూ. 50 వేలకు ఉదారంగా కేటాయించేసిన ప్రభుత్వం... 850 ఎకరాలకు రిజిష్ట్రేషన్ ఫీజు రూపేణా కొన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా... అబ్బే! మాకు డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేసేస్తామని వరం ఇచ్చేసింది. ఇదేమైనా చంద్రబాబో, రామోజీనో కష్టపడి సంపాదించినదైతే ఇలా ఇచ్చేవారు కాదేమో!! కానీ ప్రజల సొమ్ము కదా... వారిష్టం. ఈ 850 ఎకరాలతో ఊరుకున్నారా అంటే... అలాంటిదేమీ లేదు. పాపం! ఐఎంజీకి చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు తప్ప వేరే ఆఫీసు లేదు. అందుకే... బంజారాహిల్స్ నుంచి శిల్పారామం వరకు వెళ్లే మెయిన్‌రోడ్డును ఆనుకుని, ఎక్కడ కావాలని ఐఎంజీ అడిగితే అక్కడ 5 ఎకరాల స్థలాన్ని ఆఫీసుకోసం ఇస్తామని ఎంఓయూలో వరమిచ్చేశారు చంద్రబాబు! ఔరా!!!. భూములివ్వటంతో ఊరుకోలేదు చంద్రబాబు! తెలుగు ప్రజల గుండెలు పగిలిపోయే మరిన్ని క్లాజుల్ని కూడా ఒప్పందంలో చేర్చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 8 స్టేడియాల్ని బిల్లీ కంపెనీ గుర్తించింది. ఆ స్టేడియాల్ని బిల్లీకి 45 ఏళ్ల పాటు లీజుకివ్వటానికి చంద్రబాబు ఓకే చేసేశారు. కాకపోతే లీజు ధర మాత్రం చెప్పలేదు. అంటే... ఫ్రీగా ఇచ్చేసినట్లేనన్న మాట. ఇంకా మండిపోయే క్లాజేమిటంటే... ఈ స్టేడియాల్లో దేన్నయినా, ఎప్పుడు కావాలంటే అప్పుడు బిల్లీ కంపెనీ దాని స్థలానికి, నిర్మాణానికి అయిన ఖర్చును చెల్లించి కొనేసుకోవచ్చు. కాదనే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ ఈ 45 ఏళ్లలో వేరే ప్రభుత్వాలు వస్తేనో??? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా ఎందుకు! బాబుకే వచ్చింది. అందుకే... ప్రభుత్వం ఈ విషయంలో సహాయనిరాకరణ చేసినా బిల్లీ కంపెనీ తన హక్కును అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంచేసేసింది. హమ్మా! వీళ్ల అసాధ్యం కూల!! అంటే భవిష్యత్తులో ఈ స్టేడియాల్ని ఐఎంజీ స్వాధీనం చేసుకున్నా, సబ్ లీజుకు ఇచ్చుకున్నా, వేరొకరికి అమ్మేసినా అడిగే దిక్కు ఉండదన్న మాట. అదండీ కథ. ఇంతకీ ఆ స్టేడియాలేవో తెలుసా? 1) జిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ - గచ్చిబౌలి 2) ఇండోర్ స్టేడియం - గచ్చిబౌలి 3) అక్వాటిక్స్ స్టేడియం - గచ్చిబౌలి 4) ఇండోర్ స్టేడియం - సరూర్‌నగర్ 5) విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం - యూసఫ్‌గూడ 6) ఎస్ఏఏపీ వెలోడ్రమ్ - ఉస్మానియా వర్సిటీ 7) షూటింగ్ రేంజ్ - హెచ్‌సీయూ క్యాంపస్ 8) హాకీ స్టేడియం - గచ్చిబౌలి ఈ ఎనిమిది స్టేడియాల నిర్మాణానికీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.117 కోట్లు. అంటే... 45 ఏళ్ల తరవాతయినా ఐఎంజీ ఈ ధర చెల్లించి కొనేసుకోవచ్చన్న మాట. అంటే 2048లో కూడా ఐఎంజీ రూ.117 కోట్లు చెల్లించి హైదరాబాద్‌లోని 8 స్టేడియాలనూ స్వాధీనం చేసుకోవచ్చు!!. నిజానికి 2048లో ఒక స్టేడియానికి స్థలం కొనాలంటేనే అంత ఖర్చయ్యే అవకాశముంది. మరి అప్పుడు కూడా ఇదే ధరకు 8 స్టేడియాల్ని అప్పగించాలని బాబు నిర్ణయించారంటే ఆయనది ఎంత దాతృత్వం!!! ఎంత దాతృత్వం!!! ఇక్కడ ఇంకో చిత్రమైన క్లాజు కూడా ఉంది. లీజుకిచ్చాం కదా అని ప్రభుత్వం ఊరుకోలేదు. ఆ స్టేడియాల నిర్వహణకు ఐదేళ్ల పాటు ఏడాదికి రూ. 2.5 కోట్ల చొప్పున నిర్వహణ వ్యయాన్ని తామే భరిస్తామని కూడా స్పష్టంచేసింది. అంటే! లాభాలు బిల్లీకి. ఖర్చు ప్రభుత్వానికి. ఏం ప్లాను గురూ!!! పబ్లిసిటీకి 11.25 కోట్లు సమర్పణ అంతేకాదు, హైదరాబాద్ గురించి చాలా గొప్పగా ప్రచారం చేయడానికి కూడా బిల్లీరావుకు తన వంతు సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లీ చేసే ఈ ప్రచారానికి... ఏడాదికి రూ.2.5 కోట్లు చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తామని కూడా వరం కురిపించేసింది. ఇవన్నీ కాక... సాధారణంగా విద్యాసంస్థలకిచ్చే అన్ని రాయితీలనూ ఈ బినామీల బిల్లీ కంపెనీకి కూడా ప్రభుత్వం వర్తింపజేసేసింది. వీటితో పాటు 10 సంవత్సరాల పాటు వినోదపు పన్నును మినహాయించింది. అంటే 10 సంవత్సరాల పాటు ఈ మైదానాల్లో జరిగే ఏ క్రీడపై ఎంత వసూలు చేసినా... ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించరన్న మాట. ఇది ఎన్ని వందల, వేల కోట్లుంటుందన్నది ఊహకు కూడా అందని విషయం. ఇక తొలి ఐదేళ్లలో టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని ఐఎంజీిబీకి అందజేస్తారు. ఆ తరువాతి 40 ఏళ్లూ మాత్రం... ఫిఫ్టీ - ఫిఫ్టీ... అంటే సర్కారుకు సగం, బిల్లీకి సగం. ఏ క్రీడ నిర్వహించినా దానికి సంబంధించి ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని తొలి 10 సంవత్సరాలూ బిల్లీ కంపెనీయే స్వాహా చేస్తుంది. ఆ తరవాత 35 ఏళ్లలో 20 శాతాన్ని మాత్రం ప్రభుత్వానికిస్తుంది. షాపులు, రెస్టారెంట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సర్కారు- బిల్లీ చెరిసగం పంచుకుంటారు. ఇంకో షాకింగ్ న్యూసేంటంటే... రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు వైఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు... ఐఎంజీకి మాత్రం మొదటి 3 సంవత్సరాలూ ఉచితంగా విద్యుత్, మంచినీళ్లు ఇవ్వడానికి అంగీకరించేశారు. ఆ తరువాతి నాలుగేళ్ల పాటు ఈ బిల్లులపై 25 శాతం రాయితీ ఉంటుంది. ఎన్నో చిత్రమైన లిటిగేషన్లు.. గచ్చిబౌలిలో ఐఎంజీకి చంద్రబాబు కేటాయించిన భూములు... అచ్చంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్వి. వర్సిటీకి చెందిన 400 ఎకరాలను బిల్లీకి కేటాయిస్తూ... పరిహారంగా గోపన్‌పల్లి సర్వే నంబరు 36,37లో ఉన్న 317 ఎకరాల భూముల్ని యూనివర్సిటీకి కేటాయించారు బాబు. ఏం! నిజంగా క్రీడల్ని అభివృద్ధి చేసే కంపెనీయే అయితే బిల్లీకి ఆ గోపన్‌పల్లి భూములే ఇవ్వచ్చుగా? అత్యంత ఖరీదైన గచ్చిబౌలి భూముల్నే ఇచ్చారెందుకు? స్వాహా చేయడానికి కాదా? శంషాబాద్‌లో ఇచ్చిన 450 ఎకరాల్లో ఐఎంజీకి ఒక రిక్రియేషన్ సెంటర్‌ను నిర్మించాలనే షరతు పెట్టారు. అది కూడా ఎప్పుడో తెలుసా? అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన రెండేళ్లలోపు. అంటే ఈ విమానాశ్రయం 2008లో ఆరంభమైంది. 2010లోగా నిర్మించేందుకు అవకాశమిచ్చారన్న మాట బాబు. అంటే 2004లో ఒప్పందం కుదుర్చుకుని... ఆరేళ్ల సమయం ఇచ్చారన్న మాట. స్థలాన్ని మాత్రం ఎకరా రూ.50 వేల చొప్పున 2004లోనే కేటాయించేశారు. అంతేకాదు. ఆ 50వేల ధరను సైతం... వెంటనే చెల్లించాల్సిన పనిలేకుండా వరమిచ్చారు బాబు. సగం మొత్తాన్ని రిజిస్ట్రేషన్ సమయంలోను, మరో సగం మొత్తాన్ని ఎయిర్‌పోర్టు మొదలైన 90 రోజుల్లోగా చెల్లించవచ్చని చెప్పారు. అదీ... అసలు సంగతి. సగం డబ్బులకే పూర్తి రిజిస్ట్రేషన్. పెపైచ్చు ఆరేళ్ల తరవాత మిగిలింది. ఏం బొనాంజా బాబూ!! ఇదండీ ఒప్పందం. ఇప్పుడు చెప్పండి! ఈ కుంభకోణానికి విలువ కట్టడం మానవ మాత్రులకు సాధ్యమా? ఇంతటి నీచానికి దిగినందుకు జనం అప్పటికప్పుడు చంద్రబాబుకు బుద్ధి చెప్పి గద్దె దింపేయబట్టి... వైఎస్సార్ అధికారంలోకి రాబట్టి... తాత్కాలికంగా ఒప్పందం ఆగిపోయింది. అయితే ఒప్పందం అమలు కోసం ఇప్పటికీ బిల్లీ కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నారు. ఇంత నీచపు ఒప్పందం కాబట్టి... తాను జైలుకు పోకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు చక్రం తిప్పుతూనే ఉన్నారు. అవసరమైనపుడు అధికారంలో ఉన్న వాళ్లతో విచారణ తనవైపు రాకుండా పొత్తులు కూడా కుదుర్చుకుంటున్నారు. పార్టీని, విలువల్ని అన్నిటినీ తాకట్టు పెడుతూ వస్తున్నారు. అదే బాబు మళ్లీ గెలిస్తే ఏమో... ఈ బిల్లీ హూంకరించనూ వచ్చు. మరిన్ని బిల్లీలు పుట్టుకురానూ వచ్చు. -
చంద్రబాబూ..ఇదే నా చాలెంజ్!
ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో విచారణ చేయించుకో ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలిసొస్తుంది టీడీపీ అధినేతకు జగన్మోహన్రెడ్డి సవాల్ ఎమ్మార్‌కు సింగిల్ బిడ్‌పై కాంట్రాక్టు ఇచ్చారు.. ఐఎంజీ డమ్మీ కంపెనీకి 850 ఎకరాలు ఇచ్చారు దీనిపై విచారణకు ైెహకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. సిబ్బంది లేరంటూ సీబీఐ నెల రోజులు నాన్చింది బాబు నాట్ బిఫోర్ నాటకాలతో స్టే తెచ్చుకున్నారు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కై వ్యవస్థలను మేనేజ్ చేశారు {పజలపై మోయలేని విద్యుత్ భారం మోపిన కిరణ్ సర్కారును విప్ జారీ చేసి మరీ బాబు కాపాడారు బాబు తన పాలనలో అభివృద్ధి అంటూ చెప్తున్నదంతా డొల్లే.. వాస్తవానికి జరిగిందంతా తిరోగమనం ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, సేవా రంగాలన్నీ కుదేలయ్యాయి వైఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు తీసింది.. ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి ఐటీ రంగంపైనా బాబు సొంత డబ్బా ఉత్తిదే నిజానికి బెంగళూరుకన్నా మన రాష్ట్రం వెనుకబడింది బాబు హయాంలో 250 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు వైఎస్ హయాంలో 2,500 కోట్లకు పెరిగాయి బాబు 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించారు 26 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు ఆ సంస్థలను తన పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టేశారు.. నామాకు పాలేరు చక్కెర ఫ్యాక్టరీ ఇచ్చారు నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును సి.ఎం.రమేష్‌కు.. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు అప్పజెప్పారు సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్రకు, విశాఖ డెయిరీని అడారి తులసీరావుకు ఇచ్చి ప్రైవేటు కంపెనీలు చేశారు బాబు మరో ఐదేళ్లు ఉంటే.. ఏపీఎస్ఆర్టీసీ గంగలో కలిసేది.. కరెంటు ఉద్యోగులు వీధిపాలయ్యేవాళ్లు జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు విలువలు, విశ్వసనీయత ఏమాత్రం లేని వ్యక్తి.. అధికారం కోసం ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధమే టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగినవైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబునాయుడు బండారమేంటో నిగ్గు తేలాలంటే రెండే రెండు కేసుల్లో విచారణ జరిపిస్తే చాలు. ఐఎంజీ, ఎమ్మార్ రెండు కేసుల్లో విచారణ జరిపిస్తే చంద్రబాబు ఎన్ని రోజులు చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వస్తుందో తెలిసొస్తుంది. ఈ రెండు కేసుల్లో చంద్రబాబు తాను చేసిందంతా కరెక్టే అని అనుకుంటే విచారణ జరిపిద్దాం. లేదా ఆయనే విచారణకు సిద్ధపడాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి టీడీపీ అధినేతకు సూటిగా సవాల్ విసిరారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ సీబీఐని కూడా తనపై కేసుల్లో విచారణ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టిన చంద్రబాబు ఎన్నయినా మాట్లాడతారని ఆయన దుయ్యబట్టారు. జగన్మోహన్రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనను గెలిపిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని, జగన్‌ను గెలిపిస్తే చంచల్‌గూడ జైలు నుంచి పాలన సాగిస్తారని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పప్పుబెల్లాలకు భూములిచ్చేసిన ఘనుడు... ‘‘చంద్రబాబు వ్యవహారం ఏమిటో తేలాలంటే ఎంతో అవసరం లేదు. ఐఎంజీ, ఎమ్మార్ రెండు కేసులు చాలు. ఎమ్మార్ విషయంలో సింగిల్ బిడ్‌పై కాంట్రాక్టు ఇచ్చారు. ఐఎంజీ విషయంలో అయితే మరీ అన్యాయంగా వ్యవహరించారు. ఒక డమ్మీ కంపెనీకి 850 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో 230 ఎకరాలనైతే మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా చంద్రబాబు తన లెటర్‌హెడ్‌పై సంతకం చేసి కేటాయించారు. ఐఎంజీ భారత కంపెనీ ఏమిటో తమకు తెలియదని అమెరికాలోని ఐఎంజీ ఫ్లారిడా కంపెనీ కూడా చెప్పింది. అలాంటి డమ్మీ కంపెనీకి చంద్రబాబు శనక్కాయలు, బెల్లానికి (కారు చౌకగా) భూమిని కేటాయించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశిస్తుంది.. కానీ తమ వద్ద సిబ్బంది లేరని ఆ సంస్థ నెల రోజులు జాప్యం చేస్తుంది. చంద్రబాబును ఒక్క రోజూ విచారణకు పిలువదు’’ అని జగన్ ధ్వజమెత్తారు. సీబీఐ నెల రోజులు విచారణ జరపకుండా జాప్యం చేస్తే.. ఈలోపు ‘నాట్ బిఫోర్...’ డ్రామాతో కోర్టుల నుంచి చంద్రబాబు దర్యాప్తుపై స్టేలు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్య ప్రజలపై 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను బాదినా.. చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి కాపాడారని జగన్ గుర్తుచేశారు. ప్రభుత్వం నిలబడటానికి 148 మంది సభ్యుల బలం కావలసి ఉండగా, ప్రతిపక్షాలన్నీ కలిసి పెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత కాంగ్రెస్‌కు 146 ఓట్లే వచ్చాయి. మెజారిటీకి 2 స్థానాలు తక్కువగా ఉన్నా చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా విప్ జారీ చేసి మరీ కాపాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబుకు నేనొక చాలెంజ్ చేస్తున్నా... ఒక్క ఎమ్మార్, ఐఎంజీ బాగోతాలపై విచారణ జరిపించుకో చాలు... నువ్వెన్ని రోజులు చంచల్‌గూడ జైల్లో ఉంటావో చూద్దాం...’’ అని సవాల్ విసిరారు. బాబు పాలనలో అభివృద్ధి తిరోగమనం... ‘నేను అది చేశాను, ఇది చేశాను... నిర్మించాను’ అని డబ్బాకొట్టుకుంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా డొల్లేనని.. వాస్తవానికి ఆయన పాలనలో అన్ని రంగాలూ తిరోగమించాయని జగన్మోహన్రెడ్డి గణాంకాలతో సహా బయటపెట్టారు. ఒక్కో అంశాన్ని విశ్లేషిస్తూ చంద్రబాబు తన పాలనలో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధిలో ఏమాత్రం వాస్తవం లేదని విడమర్చి చెప్పారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగం లాగా సాగింది. చంద్రబాబు పాలనలో అంతా మీడియాను మేనేజ్ చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. చంద్రబాబు గోరంత చేసి కొండంత చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు పాలన 1994 నుంచి 2004 వరకూ వ్యవసాయ, పారిశ్రామిక, ఉద్యోగ, సేవా రంగాలన్నింటిలోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పైగా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. అదే వైఎస్ హయాంలో అభివృద్ధి ఎలా పరుగులు తీసిందో ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. వైఎస్ మరణించాక మళ్లీ ఆ అభివృద్ధి కుంటుపడింది’’ అని జగన్ వివరించారు. తన హయాంలో వైఎస్ అన్నివిధాలా అభివృద్ధి చేసినా ఆయన ఏనాడూ చంద్రబాబులాగా డబ్బా కొట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో చంద్రబాబు పాలనకు ముందు, ఆయన పాలనలో ఆ తర్వాత వైఎస్ పాలనలో, ఆయన మరణం తర్వాత కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై అధికారిక గణాంకాలను జగన్ చదివి వినిపించారు. ఐటీ రంగంపై బాబు డబ్బా అంతా డొల్లే... ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు రాష్ట్రం ఐటీ రంగంలో దేశం మొత్తం మీద మూడో స్థానంలో ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అది కాస్తా అయిదో స్థానానికి పడిపోయింది. చంద్రబాబు హయాంలో దేశం మొత్తం మీద మన రాష్ట్రం నుంచి ఐటీ వాటా 8 శాతంగా ఉంటే వైఎస్ హయాంలో దానిని 14 శాతానికి పెంచారు. ఇంత డబ్బా ఎలా కొట్టుకుంటున్నారు బాబూ...! చంద్రబాబు హయాంలో మన రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు 81 వేల మంది మాత్రమే ఉంటే వైఎస్ పాలనలో 2.35 లక్షల మందికి పెరిగారు. చంద్రబాబు పాలనలో 2004 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ. 5,000 కోట్ల మేరకు ఉంటే వైఎస్ ఐదేళ్ల పాలనలో ఆ ఎగుమతులు రూ. 26,000 కోట్లకు పెరిగాయి. ఇక్కడొక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఐటీ రంగంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఎగుమతుల్లో రూ. 250 కోట్ల మేరకు మాత్రమే వ్యత్యాసం ఉండేది. అదే చంద్రబాబు హయాంలో ఈ తేడా రూ. 2,500 కోట్లకు పెరిగింది. అంటే బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రూ. 2,500 కోట్ల మేర వెనుకబడి ఉంది. ఏ ముఖ్యమంత్రి పాలించిన ఐదేళ్లతో పోల్చినా వైఎస్ పాలనకు సాటి రానే రాదని గంటాపథంగా చెప్తున్నాను. ఇది ఇవాళ మేం చెప్తున్న వివరాలు కావు.. ప్రభుత్వం ప్రచురించిన గణాంకాలే. ప్రభుత్వ రంగ సంస్థలను ‘తమ్ముళ్ల’కు రాసిచ్చేశారు.. చంద్రబాబు తన హయాంలో చేసింది అభివృద్ధి కాదు, ఆయన చేసిందల్లా ఏమిటంటే 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించడం. ఉద్యోగాల గురించి పెద్దగా మాట్లాడే చంద్రబాబు తన పాలనలో 26 వేల మందిని రోడ్డు మీద పడేశారు. ఇలా మూతపడిన 65 ప్రభుత్వ రంగం సంస్థలను కూడా టీడీపీకి చెందిన తన మనుషులకే కారుచౌకగా శనక్కాయలు, బెల్లానికి ఇచ్చేశారు. టీడీపీకి చెందిన నామా నాగేశ్వరరావుకు పాలేరు చక్కెర ఫ్యాక్టరీని, నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును సి.ఎం.రమేష్‌కు, రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని దేవేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. ఇక సంగం డెయిరీని తన పార్టీకి చెందిన ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తే దానిని ఆయన ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. విశాఖ డెయిరీని టీడీపీకి చెందిన అడారి తులసీరావుకు ఇస్తే దానిని ఆయన ప్రైవేట్ కంపెనీగా మార్చేశారు.’’ బాబు ఇంకో ఐదేళ్లు ఉండి ఉంటే ఆర్టీసీ ఖతం మరో ఐదేళ్లు కనుక చంద్రబాబు పరిపాలించి ఉంటే ఏపీఎస్ఆర్టీసీ ఎపుడో గంగలో కలిసిపోయి ఉండేది. కరెంటు ఉద్యోగులు రోడ్డు మీద పడి ఉండేవాళ్లు. జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుది. ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారంలోకి రావాలన్నదే ఆయన తపన. విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేని వ్యక్తి. ఎన్నికలకు ముందొక మాట, ఎన్నికలు అయిపోయాక మరో మాట మాట్లాడ్డం ఆయన నైజం. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని చెప్తారు. ఎన్నికలయ్యాక ఈనాడు పత్రికతో మద్య నిషేధం వద్దని రాయించి దానిని ఎత్తేస్తారు. రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్తారు. ఆ తరువాత మళ్లీ రూ.5.25లకు పెంచేస్తారు. ఏ మాత్రం విశ్వసనీయత, విలువలు లేని వ్యక్తి ఆయన. అధికారం కోసం ఆయన ఎలాంటి గడ్డి కరవడానికైనా సిద్ధమే. ఆయన ఎంత దూ రం వెళతారంటే పిల్లనిచ్చిన సొంత మామను కూడా ఆధికారం కోసం వెన్నుపోటు పొడవటానికి వెనుకాడడు’’ అంటూ చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు.