ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్టను చదివించారని, అందులో పేజిన్నర వరకు నీతి, న్యాయాల గురించి రాశారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు