తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఆడియో టేపుల విడుదల తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం దాటవేశారు. అన్ని విషయాలపై రేపు (బుధవారం) సవివరంగా మాట్లాడతానని చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన ఓ హోటల్ లో చైనా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.