చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రత్యేకహోదా కోసమా, పదవి కాపాడుకోవడానికా అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేకహోదాకు చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా, రాదా... కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఎన్డీఏలో కొనసాగుతారా అని అడిగారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు.