మిషన్ భగీరథ పనుల పై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. 2017 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పారు. 365 రోజులు, 24గంటలు నీళ్లు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్ లైన్లు వేసేప్పుడు లైన్లతో పాటు ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ను కూడా వేయాలని సూచించారు.