దాసరి నారాయణరావును ప్రశ్నించిన ఈడీ | coal-scam-enforcement-directorate-questions-dasari-narayana-rao | Sakshi
Sakshi News home page

Dec 8 2014 5:32 PM | Updated on Mar 22 2024 11:22 AM

బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. కొన్నాళ్ల పాటు దాసరి నారాయణరావు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దాంతో.. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన కుంభకోణాన్ని విచారిస్తున్న ఈడీ... తాజాగా ఆయనను ప్రశ్నించినట్లు పీటీఐ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. మరోవైపు బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ సీబీఐ దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కేసు దర్యాప్తులో సీబీఐ బాగా వెనకబడినట్లు సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015 ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement