ప్రధాని మోదీకి ఓటు వేయాలన్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై మోదీని ప్రశ్నించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే రెండేళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయామని మండిపడ్డారు.