సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సోమవారం ప్రారం భం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలగుండా ఐదునెలలపాటు 4వేల కిలోమీటర్లమేర ఈ యాత్ర సాగుతుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపడుతున్న ఈ యాత్రలో జాన్‌వెస్లీ (కేవీపీఎస్), ఎస్.రమ(సీఐటీయూ), ఎంవీ రమణ(వృత్తిదారుల సంఘం), పి.ఆశయ్య (సేవాతరగతులు), కె.నగేష్ (వ్యవసాయకార్మిక సంఘం), ఎం.శోభన్‌నాయక్ (గిరిజన సంఘం), నైతంరాజు(షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్త), ఎండీ అబ్బాస్ (ట్రేడ్‌యూనియన్, మైనారిటీల హక్కుల కార్యకర్త) పాల్గొననున్నారు.