తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రతిపక్ష డీఎంకే ఆపన్నహస్తం అదించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పన్నీర్ సెల్వంకు బలం నిరూపించుకునే అవకాశం ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సుబ్బలక్ష్మి జగదీశన్ తెలిపారు.