రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్‌లోని ఘన ఇంధన విభాగానికి చెందిన ఓ భవనంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జీఎస్ఎల్వీ ఇంధనం మిక్స్ చేస్తుండగా ప్రమాదం జరిగి, ముగ్గురు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఘన ఇంధన ప్లాంటులో పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు.