ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్లక్ష్యం, తప్పిదం వల్లే నెల్లూరులో బాణసంచా పేలుడు ప్రమాద ఘటన జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గతేడాది తూర్పుగోదావరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, చంద్రబాబు కళ్లు తెరవకపోవడం వల్ల నెల్లూరులో మరో దుర్ఘటన జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు జరగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బాణసంచా పేలుడు ఘటన మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.