ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అక్టోబర్ 22 విజయదశమి రోజున శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సింగపూర్కు దీటుగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. అమరావతి ఒక మెగా సిటీగా తయారు కావాలని ఆయన అన్నారు.