ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో అసలు విషయాలను పక్కదారి పట్టించడం కోసం.. కొత్త వివాదాలు తెరమీదకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అసలుకే మోసం తెచ్చేలా మారాయి. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబును తాజా పరిణామాలు మరింత చిక్కుల్లో పడేశాయి.