IVR krishna rao
-
సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
-
'దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయండి'
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖను ప్రక్షాళన చేయాలని ఐవైఆర్ కోరారు. ఆలయాలను ఆదాయవనరుగా చూడొద్దని.. అలా చేయడం వల్ల సామాన్యలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆలయాల్లో నియమాలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. -
అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి
-
అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి: ఐవీఆర్
కొరుక్కుపేట(చెన్నై): అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. చెన్నైలో శనివారం రాత్రి తెలుగు బ్రాహ్మణ మహాసభ నిర్వహించిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అని తన అ«ధ్యయనంలో తేలిందన్నారు. దీనిపై ఎవరైనా బహిరంగ చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. -
ధర్మాన్ని రక్షిద్దాం..
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ప్రతిఒక్కరూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వి.ఆర్. కృష్ణారావు చెప్పారు. సీతానగరంలోని ‘సీత’ కార్యాలయంలో ఆదివారం సమరసత ఫౌండేషన్ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొన్నారు. హిందూ ధర్మంలో అందరూ సమానమేనని అన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. కంచి స్వామి విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ విశ్వశాంతి కోసం అందరూ ధర్మాన్ని పాటించాలని ఉద్బోధించారు. ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ‘సీత’ డైరెక్టర్ వి.జయరాఘవాచార్యులు, అక్షర భారతి ఉపాధ్యక్షుడు డి.రామకృష్ణ పాల్గొన్నారు. -
'భవన్స్' చైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావు
భారతీయ విద్యాభవన్ హైదరాబాద్ కేంద్రం చైర్మన్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యారు. శుక్రవారం ఆయన ఛెర్మైన్‌గా బాధ్యతలుచేపట్టారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా కొనసాగిన ఆయన.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛెర్మైన్‌గా కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమం, జూబ్లీహిల్స్ ఆత్మకూరి రామారావు భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌తో పాటు నగరంలోని భారతీయ విద్యాభవన్ స్కూళ్లకు ఇక నుంచి ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు వైస్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
సవాలుగా వామపక్ష తీవ్రవాదం
అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా తిప్పికొట్టాలి ♦ తీరప్రాంత భద్రతను పటిష్టం చేయాలి ♦ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపు ♦ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ప్రారంభోపన్యాసం ♦ రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రాంతీయ, అంతర్రాష్ట్ర మండళ్ల దోహదం సాక్షి, విజయవాడ బ్యూరో: వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో తీరప్రాంత రక్షణ కూడా సవాలుగా మారిందని, దీనిని పటిష్టం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. 26వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం శనివారమిక్కడ జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. దేశప్రగతికి సమాఖ్య వ్యవస్థలోని ప్రాంతీయ మండలి ఫోరం కీలకపాత్ర వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాంతీయ, అంతర్రాష్ట్ర మండళ్లను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ మండళ్లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రాలమధ్య నిర్మాణాత్మక సహకారానికి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగడానికి ఈ వ్యవస్థలు కీలకమని చెప్పారు. వరద బాధితుల్ని ఆదుకుంటాం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీవర్షాలవల్ల చనిపోయిన వారికి సమావేశం నివాళులర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. వరద బాధితులు సాధారణ స్థాయికి చేరుకునేవరకు కేంద్రం అన్నివిధాలుగా సహకారమందిస్తుందని హామీఇచ్చారు. బాధితులకు పునరావాసం కల్పిస్తామని, సహాయకచర్యలను కొనసాగిస్తామని తెలిపారు. పలు అంశాలపై చర్చ... సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. తీరప్రాంత భద్రత, పారిశ్రామిక కారిడార్, పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టడం, పారిశ్రామిక రాయితీల మంజూరులో ఒకేరకమైన విధానం అమలు, అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందాలు, పళ్లు, కూరగాయల సాగులో ప్రమాదకర పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యసేవలు, నర్సింగ్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకేరకమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంపై చర్చించారు. 2012లో బెంగళూరులో జరిగిన సమావేశం చేసిన సిఫారసుల అమలు ఎంతవరకూ వచ్చిందనే విషయాలపైనా సమీక్షించారు. సమావేశ వివరాల్ని మండలి సమన్వయకర్త(కోఆర్డినేటర్) జయశీలన్.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కలసి మీడియాకు వివరించారు. వివరాలివీ.. ► తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బలగాలు పెంచుతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అదనపు బలగాలు, భద్రతా చర్యలకు అవసరమైన ఖర్చును కేంద్రమే భరిస్తుందని పేర్కొంది. ► చెన్నై-బెంగళూరు-అమరావతి-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాల నివేదిక పంపితే ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ఈస్ట్‌కోస్ట్‌లో సరకు రవాణాకోసం మూడో రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించగా పరిశీలిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ► నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఏపీ, కేరళ రాష్ట్రాలు కోరగా పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ హామీఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో కలసిన ఏడు మండలాల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించగా.. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని హోంశాఖ తెలిపింది. ► మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ► తదుపరి సమావేశాన్ని కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించాలని నిర్ణయించారు. ► సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్‌కుమార్‌సింగ్, కేరళ జలవనరులశాఖ మంత్రి పీజే జోసెఫ్, తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం, ఐదు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై చర్చ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాన్ని తెలంగాణ లేవనెత్తినట్లు సమాచారం. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేకమైన యంత్రాంగం ఉన్నందున.. అక్కడే దీనిపై చర్చించాలని మండలిలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అలాగే జాతీయ రహదారుల బిల్లుపైనా తెలంగాణ పలు అభ్యంతరాల్ని లేవనెత్తినట్లు సమాచారం. -
దశలవారీగా ఉద్యోగుల తరలింపు
కమిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధానికి దశలవారీగా ఉద్యోగులను తరలించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. గురువారం రాజధాని ఉద్యోగుల తరలింపు కమిటీ సభ్యులు శ్యాంబాబు తదితరులతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వచ్చే విద్యా సంవత్సరానికల్లా కనీసం 2 వేల నుంచి 3 వేల మంది ఉద్యోగులను హైదరాబాద్ నుంచి తరలించాలని నిర్ణయించారు. అయితే స్థానికత విషయం తేలేవరకూ కొత్త రాజధానికి ఎలా వెళతామని ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
గవర్నర్ సీరియస్
-
గవర్నర్ సీరియస్
* ఏపీ మంత్రుల అభ్యంతరకర దూషణలపై నరసింహన్ ఆగ్రహం * కేంద్రం కన్నెర్ర.. చిక్కుల్లో ఏపీ సీఎం చంద్రబాబు * రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు మాట్లాడే భాషేనా.. * ఏపీ సీఎంకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? * ఇలాంటి ధోరణి ఎక్కడా చూడలేదంటూ గవర్నర్ మండిపాటు * అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై కేంద్రం కూడా ఆరా * గవర్నర్‌తో మాట్లాడి వివరాలు సేకరించిన హోం శాఖ కార్యదర్శి * ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై క్లిప్పింగ్‌లను కేంద్రానికి పంపిన గవర్నర్ * ఏపీ సీఎస్ కృష్ణారావుకు గోయల్ మందలింపు * వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మంత్రులకు బాబు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో అసలు విషయాలను పక్కదారి పట్టించడం కోసం.. కొత్త వివాదాలు తెరమీదకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అసలుకే మోసం తెచ్చేలా మారాయి. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబును తాజా పరిణామాలు మరింత చిక్కుల్లో పడేశాయి. ఢిల్లీలోనే ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును పిలిచి తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పాటు తాజాగా గవర్నర్‌పై ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మొత్తం వివరాలను కేంద్ర హోం శాఖ తెప్పించుకుని పరిశీలించింది. శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఫోన్లో మాట్లాడి జరుగుతున్న పరిణామాలేంటో అడిగి తెలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలేవైనా ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే ఏపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్న తీరును గవర్నర్ వివరించినట్టు తెలిసింది. అంతకుముందు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు తదితరులతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు చేయడాన్ని గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు రాజ్యాంగ బద్ధమైన గవర్నర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ‘ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయా? చంద్రబాబుకు తెలియకుండానే మంత్రులు అడ్డగోలు భాషను ప్రయోగిస్తున్నారా?’ అంటూ ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ‘గవర్నర్ స్థానంలో ఎవరున్నా రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తుంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు ఏ సమస్య చెప్పాలనుకున్నా వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పటికి చాలామంది నేతలొచ్చి కలిశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు అనేకసార్లు కలిశారు. ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రంలో ఏవైనా సంఘటనలు జరిగితే కేంద్రానికి నివేదించడానికి కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారా? ఇలాంటి ధోరణులను ఎక్కడా చూడలేదు..’ అంటూ మండిపడ్డారని తెలిసింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో కేంద్రానికి గవర్నర్ నివేదిక ఒక్కటే అవసరం కాదు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)తో సహా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటాయి. అలాంటివి పట్టించుకోకుండా ఒక రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు మాట్లాడటాన్ని కేంద్రం సైతం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు గవర్నర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్న విషయాలు జాతీయ మీడియాలో రావడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్ స్వయంగా గురువారం సాయంత్రం గవర్నర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగారు. గవర్నర్ మొత్తం వ్యవహారాన్ని విడమరిచి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, టీవీల్లో ప్రసారమైన వీడియో టేపులను ఆయన కేంద్ర హోం శాఖకు పంపించారు. వివరణలోనూ అచ్చెన్నాయుడు తిరకాసు బుధవారం విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గవర్నర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అందులో ఎక్కడా గవర్నర్ అన్న మాట ప్రస్తావించకుండా మీడియాకు వివరణ పత్రం పంపించారు. అందులో ‘‘నిన్న నేను విలేకరుల సమావేశంలో గంగిరెద్దు అన్న మాట ఆయన మీద ద్వేషంతో అన్న మాట కాదు. మా రాష్ట్రం ఈరోజు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆవేదనలో వచ్చిన మాట. కావాలని అన్న మాట కాదు. దీనిని ఎవరూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసును గాయపరిస్తే నేను ఆ మాటను ఉపసంహరించుకున్నాను’’ అని పేర్కొన్నారు. పక్కదారి పట్టించబోయి..! ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు పొక్కిన రోజు నుంచి చంద్రబాబు దానిని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదంగా మార్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా విభజన చట్టంలోని సెక్షన్ 8, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండటం, ఉద్యోగుల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలను తెరమీదకు తెచ్చారు. స్టీఫెన్‌సన్‌తో జరిగిన సంభాషణపై వివరణ ఇవ్వకుండా గడచిన 20 రోజులుగా ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తూ వివాదం చేయడానికి ప్రయత్నించారు. చివరకు గవర్నర్‌ను వివాదంలోకి లాగాలన్న ప్రయత్నంలో ఆయనపై వ్యక్తిగత దూషణలు మొదలుపెట్టినట్టు జరిగిన సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు తలెత్తిన సమయంలో ఏ నాయకుడొచ్చి కలుసుకున్నా అపాయింట్మెంట్ ఇచ్చి వారు చెప్పిన వివరాలను నరసింహన్ తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి సామరస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఓటుకు కోట్లు విషయంలో ఆయన కేంద్రానికి వాస్తవ నివేదిక ఇచ్చారన్న అనుమానాలతో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కాదని ఆయన సలహాదారులను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అధికార తెలుగుదేశం గవర్నర్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ విషయాలను గవర్నర్‌తో పాటు కేంద్రం తీవ్రంగా పరిగణించడంతో కథ అడ్డం తిరిగినట్టయింది. మరిన్ని చిక్కుల్లో.. చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యలు ప్రజా సమస్యలుగా మలచడానికి చేసిన ప్రయత్నాలు తాజా ఘటనలతో బెడిసికొట్టినట్టయింది. పైగా ఆయన్ను మరింత చిక్కుల్లో పడేశాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గురువారం ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును తీవ్రస్థాయిలో మందలించినట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలకు కూడా దారితీయొచ్చని హెచ్చరించినట్టు తెలిసింది. ఆయన హడావుడిగా విజయవాడలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జరిగిన విషయాలను వివరించారు. దీంతో బిత్తరపోయిన చంద్రబాబు హుటాహుటిన మంత్రులకు ఫోన్లు చేసి గవర్నర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా వివరణలు పంపించాలని ఆదేశించారు. గవర్నర్‌ను క్షమాపణలు కోరాలని చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం రాత్రి పత్రికా కార్యాలయాలకు వివరణ పంపించారు. ‘ఆయన మనసును గాయపరిస్తే నేను ఆ మాటను ఉపసంహరించుకుంటున్నాను..’ అని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. అలాగే గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలతో పాటు ఆ సందర్భంగా అన్న అన్ని మాటలను ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు సందేశం పంపించారు. -
ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే: ఐవీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ యంత్రాంగమంతా ఉత్తరాంధ్రలోనే ఉందని ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఐవీఆర్ తెలిపారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ఐవీఆర్ అన్నారు. మోడీ ప్రకటించిన ఆర్ధిక సహాయం కేంద్రం నుంచి సత్వరమే అందుతుందని భావిస్తున్నామని సాక్షితో ఐవీఆర్ అన్నారు. -
గత సర్కార్లపై దుమ్మెత్తిపోయండి
*శ్వేతపత్రాల తయారీపై ఏపీ సీఎస్ సూచనలు *కుదరదంటూ మండిపడిన సీనియర్ ఐఏఎస్‌లు *శ్వేతపత్రాలంటే ఉన్న వాస్తవ పరిస్థితినే చెపుతాం *గత నిర్ణయాలు లోపాలని ఎలా చెబుతాం? *మీకు కావాల్సినట్లు తయారుచేయలేమని స్పష్టీకరణ *ఇక్కడ చర్చ వద్దంటూ సీఎస్ అసహనం హైదరాబాద్: శ్వేతపత్రాలపై ఆదిలోనే చిచ్చురేగింది. గత ప్రభుత్వాల్లో పాలన పట్టాలు తప్పిందన్నట్లుగా శ్వేతపత్రాలను రూపొందించాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించారు. శ్వేతపత్రాల్లో వాస్తవ పరిస్థితులను వివరిస్తామే తప్ప గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిపై సీఎస్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలంటే ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడం కాగా, అందుకు పూర్తి భిన్నంగా శ్వేత పత్రాలను రూపొందించాలని సీఎస్ కొన్ని సూచనలు చేశారు. గత పది సంవత్సరాలుగా పాలన పట్టాలు తప్పిందనే అర్థంవచ్చేలా, గత ప్రభుత్వాల్లో ప్రధాన రంగాల్లో లోపాలు జరిగాయంటూ శ్వేతపత్రాలను రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్య రంగాల్లో లోపాలను ఎత్తి చూపుతూ శ్వేతపత్రాలను రూపొందించాలని సూచించారు. దీనిపై పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు జరిగాయని ఎలా తప్పుపడతామని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దాని ప్రకారం అధికారులు అమలు చేశారని, ఇప్పుడు ఆ పథకంలో లోపాలున్నాయని, అ నిధులు వృథా అయ్యాయని ఏ విధంగా శ్వేతపత్రం రూపొందిస్తామంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. దీనిపై సీఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇక్కడ చర్చ వద్దంటూ గట్టిగా మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన వ్యయం వృథా అంటూ శ్వేతపత్రం రూపొందించాలని సీఎస్ సూచించారు. దీనిపై కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మేరకే జరిగిందని, కాలువలు తవ్విన మాట వాస్తవమేనని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇప్పుడు పెట్టిన ఖర్చుకు ఫలితం వస్తుందని సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జాప్యం అవుతుందనే ఉద్దేశంతోనే తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తి చే యడంతో రైతులకు సాగునీరు అందుతోందని సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. పోలవరం పూర్తయ్యాక తాడిపూడి, పుష్కరం వృథా అవుతాయి కదా అంటే ఎలాగని, గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల మేరకే ఆ నిర్మాణాలు సాగాయని అధికారులు వివరించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ కాగ్ నివేదికలను ఇచ్చింది కదా ఆ నివేదికలనే కొత్త ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని, ఇక కొత్తగా శ్వేతపత్రాలు ఎందుకంటూ మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తంమీద సీనియర్ ఐఏఎస్లందరూ సీఎస్ సూచనలపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ... ఏ రంగానికి ఎంత వ్యయం చేశాం, దానివల్ల ఎంత మేర పని అయిందనే వివరాలతో వాస్తవ పరిస్థితిని శ్వేతపత్రాల్లో వివరిస్తాం తప్ప మీకు కావాల్సినట్లు తయారు చేయలేమని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. -
కొత్త సీఎస్ కృష్ణారావు?
-
కొత్త సీఎస్ కృష్ణారావు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎంపికకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫైలు పంపించారు. 1979, 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఏడుగురు పేర్లతో కూడిన ఫైలును సీఎస్ ముఖ్యమంత్రికి పంపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎస్ ఎంపిక ఫైలును చూడటానికి విముఖత వ్యక్తం చేసిన పక్షంలో ప్రస్తుతం సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తూ మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రస్తుత సీఎస్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం 1979 ఐఏఎస్ బ్యాచ్, 1980 ఐఏఎస్ బ్యాచ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేర్లను జాబితాలో సీఎస్ పేర్కొన్నారు. సీఎస్ జాబితాలో పేర్కొన్న వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1979 ఐఏఎస్ బ్యాచ్‌లో ఐ.వి.సుబ్బారావు (ప్రస్తుతం యునెస్కోలో పనిచేస్తున్నారు), సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చందనాఖన్, సాధారణ పరిపాలన (ఆర్‌ఐఏడీ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జె. ఆర్. ఆనంద్, అలాగే 1980 బ్యాచ్‌కు చెందిన కేంద్ర సర్వీసులో ఉన్న సత్యనారాయణ మహంతి, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న డి. లక్ష్మీపార్థసారథి, అశ్వనీకుమార్ పరీడాలతో కూడిన జాబితాను సీఎంకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం మహంతి ముందుగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత ఫైలు ఆమోదం పొందారు. 28వ తేదీ పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు, రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరగనుంది. రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో మహంతితో పాటు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజన తరువాత పంపిణీలోనూ ఇరువురు కీలక భూమిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈ నెలాఖరులోగా భూ పంపిణీని పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ ఐవీఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన జాబితాతోపాటు భూమిని వెంటనే అసైన్మెంట్ కమిటీలతో ఆమోదింపజేయాలన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు లేని చోట ఇన్చార్జి మం్ర, లేదా జిల్లా మంత్రి అనుమతితో పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. గత విడతకు సంబంధించి అసైన్మెంట్ కమిటీల ఆమోదం ఆలస్యమైన కారణంగా పంపిణీలో జాప్యమైందన్నారు. ఈసారి అలా కాకుండా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించి, ఈ సమస్య రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. పట్టాలతోపాటు భూములు చూపించాలి ఈ విడత లబ్ధిదారులకు పట్టాలతోపాటు భూములు సైతం వెంటనే చూపించాలన్నారు. ఇక ఎస్డీ రికార్డ్సు ప్రకారం ఏడు రకాల సర్టిఫికెట్లను అక్కడికక్కడే పంపిణీ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ విడత భూ పంపిణీకి సంబంధించి ఇది వరకే రెండు నియోజకవర్గాల్లో ఆమోదం తీసుకున్నామని జే సీ ఎల్.శర్మన్ వివరించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో ఆమోదించి ఈ నెలాఖరు నాటికి పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాంకిషన్, కలెక్టరేట్ ఏఓ కిషన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.